Pinnelli Ramakrishna Reddy: జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి.. స్వాగతం పలికిన వైసీపీ నేతలు..
- నెల్లూరులోని కేంద్ర కారాగారం నుంచి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి విడుదల..
- రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..
- జైలు నుంచి విడుదలైన పిన్నెల్లికి స్వాగతం పలికిన వైసీపీ నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pinnelli Ramakrishna Reddy: నెల్లూరులోని కేంద్ర కారాగారం నుంచి పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలయ్యారు. వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.. ఈ ఉత్తర్వుల కాపీని ఈరోజు ఉదయం ఆయన న్యాయవాదులు కేంద్ర కారాగారంలో అందజేశారు. దీంతో అధికారులు ఆయనను విడుదల చేశారు. జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి.. అనిల్ కుమార్ యాదవ్ లు స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం జైలు వద్దకు పిన్నెల్లి అనుచరులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వారిని పోలీసులు జైలు ప్రాంగణం నుంచి బయటకు పంపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి బయటకు రాగానే ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు.
Read Also: Blast in Firework Factory: ఏపీలో మరో ప్రమాదం.. టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు.. ఇద్దరు మృతి
Also Read
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్ఫైర్, నో మిస్ఫైర్..
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
ఇక, పిన్నెల్లి విడుదల అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఇలాంటి కేసులకు వైసీపీ నేతలు కార్యకర్తలు భయపడరని.. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. దేశంలో చాలా చోట్ల ఈవీఎంలను పగలగొట్టినా కేవలం పిన్నిల్లి పైనే కేసు నమోదు చేశారన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విడుదల చేశారు.. ప్రజలకు సంబంధించిన వ్యక్తిపై వివిధ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారన్నారు.. చంద్రబాబును విమర్శించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు.. కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే మేం భయపడేది లేదన్నారు. చంద్రబాబు ఇలానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు కాకాని గోవర్ధన్‌రెడ్డి..
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
-
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
-
Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
-
RC 17: సైలెంటుగా సుకుమార్ – చరణ్ సినిమా ఓపెనింగ్.!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!