ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో అర్ధరాత్రి ఎడతెరిపిలేని కుంభవృష్టి కురిసింది.. క్షేత్రం పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా 4 గంటల పాటు భారీ వర్షం పడింది.. వర్షం ధాటికి క్షేత్రంలోని కొత్తపేట, శ్రీగిరి కాలనీలో ఇళ్లలోకి చేరింది వర్షపు నీరు.. ఎగువన అటవీప్రాంతం నుండి నీరు ప్రవాహంలో బైక్లు కొట్టుకుపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే ఏపీలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అయితే, దీనిపై ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.. ఎందుకంటే.. ఈ రోజు రవాణాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అదనంగా 2 వేల బస్సులు.. 3500 మంది డ్రైవర్ల నియామకంపై చర్చించనున్నారు.. అదే విధంగా రాష్ట్రాల సరిహద్దుల్లో రవాణ శాఖ చెక్ పోస్టుల ఏర్పాటు చేయాలా..? వద్దా..? అనే అంశంపై కూడా ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్…
భవన నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి త్వరితగతిన అన్ని అనుమతులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఏపీ మున్సిపల్ మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. భవనాల నిర్మాణాల కోసం అనుమతులిచ్చే శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వంగనూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నుండి వెళ్తున్న కారును లారీ ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.. మృతులు ప్రతాప్ రెడ్డి ( 22), ప్రమీల(21) ఘటనా స్థలంలోనే కన్నుమూయగా.. వెంకటమ్మను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలోని తన ఇంటికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రాగా.. ఆయన ఇంటిని ముట్టడించడానికి టీడీపీ కార్యకర్తలు యత్నించారు.
ఏపీలో నూతన ఇంధన పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 పేరిట కొత్త విద్యుత్ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది. రెన్యూవబుల్ ఎనర్జీలో 2014- 2019 మధ్య కాలంలో దేశంలో టాప్లో ఉన్న ఏపీ.. 2019 తరవాత ప్రభుత్వ విధానాలతో సంక్షోభంలోకి విద్యుత్ ఉత్పత్తి రంగం వెళ్లిందని అధికారులు వివరించగా.. గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని, ప్రభుత్వ లక్ష్యసాధనకనుగుణంగా అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మంగళవారం నాడు వెలగపూడి సచివాలయంలో విభిన్న ప్రతిభావంతులు, వయో వయోవృద్దులు, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమంపై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
అక్టోబరు 2 తేదీన వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించేలా కార్యాచరణ చేపట్టినట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. ఏడాదికి 15 శాతం వృద్ధిరేటు సాధనే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు.