AP Wines Shops Close: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మందబాబులకు బ్యాడ్న్యూస్.. రేపు మద్యం షాపులు బంద్ చేయాలని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిర్ణయించింది. ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్తోనే ఈ బంద్కు పిలుపునిచ్చినట్లు తెలిపారు.
Shivraj Singh Chauhan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో వరద ముంపు కారణంగా బుడమేరు వాగు పొంగి కేసరపల్లి దగ్గర పంట పొలాలు ముంపుకు గురి కావడంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేరుకున్నారు.
Minister Narayana: విజయవాడలో వరద బాధితులకు పంపిణీ చేసేందుకు పలు రకాల ఆహార పదార్థాలను ప్రత్యేకంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్యాక్ చేయించింది. సిద్ధార్థ కాలేజీలో ప్యాకింగ్, పంపిణీ తీరును మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు.
Vijayawada Floods: కొల్లేరుకు బుడమేరు వాగు వరద ఉధృతి భారీగా పెరిగిపోయింది. నిన్నటి కంటే రెండు అడుగుల మేర కొల్లేరు నీటి మట్టం ఎక్కువ అయిందని అధికారులు చెప్తున్నారు. దీంతో 15 గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. కే
TDP Office Attack Case: గుంటూరు జిల్లాలోని తెలుగు దేశం కేంద్ర కార్యాలయం పై దాడి ఘటనలో కీలక నేతల అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతుంది. కొంత మంది కీలక నేతలను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అసత్య ప్రచారాలను పోలీసు అధికారులు కొట్టి పారేస్తున్నారు.
Flood Victims in Vijayawada: బెజవాడలో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం వరద బాధితులు కంపెనీలకు భారీగా చేరుకుంటున్నారు. వరద నీరు తగ్గిన ప్రాంతాల నుంచి క్లెయిమ్ కోసం బాధితులు వస్తున్నారని ఇన్సూరెన్స్ సర్వేయర్ మధుబాబు మాట్లాడుతూ.. వరదల్లో పాడైన వాహనాల ఇన్యూరెన్స్ క్లెయిమ్ చేసిన 12 రోజుల్లో ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం చెబుతోంది అన్నారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన వరద నష్టంపై ఇవాళ (శుక్రవారం) సాయంత్రంలోగా కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బుడమేరు గండి పూడ్చివేతలో సైన్యం సాయం తీసుకుంటున్నామని చెప్పారు.
Dowleswaram Barrage: గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పడిన భారీ వర్షాలతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన కృష్ణ, గోదావరి నదులకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. అయితే, ప్రస్తుతం కృష్ణమ్మ కొంచెం శాంతించినా.. గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతూనే ఉంది.