బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులను యుద్ధప్రాతిపదికన చేస్తున్నాయి. బుడమేరు గండ్లను ఇవాళ పూడ్చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఆర్మీ సాయంతో మూడో గండి పూడ్చివేత పనులను అధికారం ముమ్మరం చేశారు. గాబీయన్ బాస్కెట్ విధానంలో పనులు జరుగుతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం లాలాచెరువు సమీపంలోని గోదావరి మహా పుష్కర వనం - హౌసింగ్ బోర్డ్ కాలనీల సమీపములో అర్ధరాత్రి చిరుతపులి సంచరించిన నేపథ్యంలో అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
వరద బాధితులకు వైయస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విరాళం ప్రకటించారు.. తమ నెల జీతం విరాళంగా ప్రకటించారు వైసీపీ ప్రజాప్రతినిధులు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ చేపడుతున్న సహాయ కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి..
వరద నష్టంపై రేపు కేంద్రానికి నివేదిక అందచేస్తాం.. నష్టం అంచనాలపై నివేదిక రేపు పంపనున్నట్టు వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన, ఏరియల్ సర్వే తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఏరియల్ సర్వే చేశాను.. కొల్లేరు సరస్సు, బుడమేరు, కృష్ణానది పరివాహక ప్రాంతం చూశాను.. బుడమేరు గండ్లు పూడ్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఈ రోజు రాత్రి కల్లా బుడమేరు గండ్లు పూడుస్తామని వెల్లడించారు.. ఆర్మీ వాళ్ళు కూడా సర్వశక్తులు ఒడ్డి…
వర్షాలు, వరదలతో భారీ నష్టాన్ని చవి చూసిన తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించినట్టు వార్తలు గుప్పుమన్నాయి.. వరద సాయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్ల నిధులు విడుదల చేసినట్టు ప్రచారం జరిగింది.. అయితే, ఈ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ వచ్చి చేరింది.. కేంద్రం సాయం చేసింది అనే వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు.. నాకు కూడా రెడ్ బుక్ ఉంది.. అందులో 100 మందికిపైగా ఉన్నారు.. ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు.. అంటే వారిని నేను ఏదో కట్టె పట్టుకొని కొడతానని కాదు.. చంపేస్తానని కాదు.. ఖచ్చితమైన ఆధారాలతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.