Home Minister Vangalapudi Anitha: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత.. వరద సాయంపై చర్చకు రావాలని సవాల్ చేశారు.. వరద సాయంపై చర్చించడానికి మేం సిద్ధం.. వైసీపీ నుంచి చర్చకు ఎవరైనా వస్తారా..? అని చాలెంజ్ చేశారు.. ఎన్టీఆర్ జిల్లాలో రూ. 92 కోట్లు మాత్రమే ఆహారం కోసం ఖర్చు చేశాం. వరద సాయం కింద ఎన్టీఆర్ జిల్లాకు విడుదల చేసిందే రూ. 139 కోట్లు. అంతకు మించి అవినీతి జరిగిందని ఎలా చెబుతారు..? అంటూ మండిపడ్డారు.. వరద సాయం అందించడమే కాకుండా.. బుడమేరు గండ్లను పూడ్చేలా మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పారు. కలెక్టరేట్‌లో మకాం వేసి రాష్ట్రంలో ఉన్న వరద ప్రాంతాల్లో పరిస్థితి సీఎం చంద్రబాబు సమీక్షించారు.. వార్డులకు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించారు. ప్రతి చిన్న అంశాన్ని పట్టించుకున్న చంద్రబాబు లాంటి నాయకుడు ఎవరైనా ఉంటారా..?ఖాజానా ఖాళీ చేసేసి.. అవినీతి ఖాజానా అంటారా..? ఖాజానాలో సొమ్ముని తన జమానాలోనే జగన్ జమ చేసేసుకున్నారు అంటూ మండిపడ్డారు..
Read Also: Devara: అయ్యో.. మిస్ అయ్యామే! తెగ బాధపడుతున్న ఎన్టీఆర్ ఫాన్స్
ఎగ్ పఫ్‌లకు జగన్ హయాంలో ఖర్చు పెట్టినట్టు కాదు. మా ప్రభుత్వంలో ప్రజల కోసమే ఖర్చు పెడతాం అన్నారు అనిత.. గ్యాస్ స్టవ్వులు కూడా బాగు చేయించిన సీఎం ఎవరైనా ఉంటారా..? సీఎంగా ఉన్నప్పుడు జగన్ హెలీకాప్టరులో వెళ్లేవారు. కానీ, చంద్రబాబు జేసీబీల్లో పర్యటించారు. నీట మునిగిన ప్రతి ఇంటిని కడిగించారు. జగన్‌ది అంతా ఫేక్ బతుకు.. ఎందుకీ బతుకు..? 11 సీట్లు వచ్చేసరికి జగనుకు చిప్ పోయినట్టుంది. పుంగనూరులో ఓ అమ్మాయిని చంపేస్తే.. నలుగురు రేప్ చేసి చంపేశారని వైసీపీ ప్రచారం చేస్తోంది. తాను చేసే అవినీతే అందరూ చేసేస్తారనే భ్రమలో జగన్ ఉన్నారు అంటూ విరుచుకుపడ్డారు.. మేం పేరు కోసం కాదు.. ప్రజల కోసం పని చేశాం. ప్రజల కోసం పని చేస్తే.. పేరు ఆటోమేటిగ్గా వస్తుందన్నారు.. అయితే, అధికారిక చిహ్నాలను దుర్వినియోగం చేస్తున్నారు.. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రంగులకు.. సర్వే రాళ్లకు, ఎగ్ పఫ్ ల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టిన వాళ్లా మా గురించి మాట్లాడేది..? అంటూ ఎద్దేవా చేశారు హోం మంత్రి వంగలపూడి అనిత.