JC Prabhakar Reddy: రోడ్లపై చెత్త వేస్తే కేసులు.. పరిశ్రమలకు కరెంట్ కట్.. జేసీ వార్నింగ్
- తాడిపత్రి అభివృద్ధి కోసం కఠిన నిర్ణయాలు తప్పవన్న జేసీ..
- ప్రజలు.. బంధువులు.. స్నేహితులు సహకరించాలని విజ్ఞప్తి..
- రోడ్లపై చెత్తవేస్తే కేసులు నమోదు చేస్తామని వార్నింగ్..
- పరిశ్రమలు వేస్ట్ రాళ్లు రోడ్డు పక్కన వేస్తే కరెంటు బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy: తాడిపత్రి అభివృద్ధి కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం.. ప్రజలు తమ బంధువులు.. స్నేహితులు సహకరించాలని చేతులు జోడించి విన్నవించారు. ఇక, తాడిపత్రి చుట్టుపక్కల ఉన్న బైపాస్ రోడ్లలో చెత్తవేస్తే కేసులు నమోదు చేస్తామంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. నందలపాడు, సజ్జలదిన్నె పారిశ్రామిక వాడల్లో ఉన్న నల్ల బండలలో పాలిష్ వృథా రాళ్లు రోడ్ల పక్కన వేస్తే ట్రాక్టర్లు సీజ్ చేస్తామన్నారు.
Read Also: ICMR Report: సమోసా, చిప్స్, కేక్స్ వల్లే దేశంలో షుగర్ వ్యాధి విస్తరిస్తోంది.. షాకింగ్ రిపోర్ట్
Also Read
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Ganesh Immersion Without Water: నీళ్లు లేవు గణపయ్య.. క్షమించవయ్యా.. ఎండిన కాలువలోనే విగ్రహాలు..
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
ఇక, తాడిపత్రి అభివృద్ధి చెందిందంటే పరిశ్రమల వల్లే సాధ్యమైందన్నారు జేసీ… పరిశ్రమలు స్థాపించిన యజమానులు అందరూ బాగా చదువుకున్న వారేనని.. పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమలు వేస్ట్ రాళ్లు రోడ్డు పక్కన వేస్తే పరిశ్రమలకు కరెంటు బంద్ చేయిస్తామని స్పష్టం చేశారు.. తాడిపత్రి అభివృద్ధి కోసం తప్పనిసరి పరిస్థితులలో ఈ నిర్ణయాలు తీసుకున్నామన్నారు. పారిశ్రామిక వాడల చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గ్రానైట్ నల్లబండల వృథా రాళ్లు ఎక్కడపడితే అక్కడ వదిలేసేవాళ్లపై చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్ లోపు తాడిపత్రి పట్టణమంతా శుభ్రంగా ఉంచాలన్నారు.. ఆయా ప్లాట్ల మధ్యలో రోడ్లు వేస్తానని.. నష్టపోకుండా ఫ్లాట్ల యజమానులు చూసుకోవాలన్నారు. మరోవైపు.. ట్రాక్టర్లు విడిపించుకోవడానికి తన బంధువులు.. స్నేహితులు.. పార్టీ నాయకుడు ఎవరు తన వద్దకు రావద్దని చేతులు జోడించి విన్నవించారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.
తాజావార్తలు
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?