TDP: నేడు టీడీపీ గూటికి వైసీపీ మాజీ ఎంపీలు..
- నేడు టీడీపీ గూటికి మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ.. బీద మస్తాన్ రావు..
- ఇప్పటికే వైసీపీకి.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా..
- ఈ రోజు సాయంత్రం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా వైసీపీకి షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. పార్టీకి రాజీనామా చేసి.. కొందరు టీడీపీ.. మరికొందరు జనసేన.. ఇంకా కొందరు బీజేపీ ఇలా వరుసగా చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి.. మరోవైపు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఇప్పటికే రాజీనామా చేసిన సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు.. ఈ రోజు టీడీపీ గూటికి చేరనున్నారు.. సాయంత్రం 6 గంటలకు ఉండవల్లిలోని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయన సమక్షంలో.. టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.. ఇక, ఈ ఇద్దరు మాజీ ఎంపీల వెంట పెద్ద సంఖ్యలో అనుచరులు కూడా టీడీపీ కండువాకప్పుకుంటారని తెలుస్తోంది..
Read Also: Mushrooms: పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచివేనా? మరి ఏ రకమైన వాటిని తినడం మంచిది?
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
- Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
కాగా, ఇప్పటికే రాజ్యసభ పదవులకు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన విషయం విదితమే.. తమ రాజీనామా పత్రాలను రాజ్యసభ చైర్మన్‌కు అందజేశారు.. బీద మస్తాన్ రావుకు మరో నాలుగేళ్లు, మోపిదేవికి రెండేళ్లు సభ్యత్వం మిగిలి ఉండగానే.. రాజీనామా చేయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఇక, తమ రాజీనామా వెనుక ఎటువంటి ప్రలోభాలు లేవని, స్వచ్ఛందంగా రాజీనామాలు చేశామని చెప్పిన నేతలు.. ఇప్పటి వరకు పార్టీలో గౌరవం అవకాశం ఇచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన మస్తాన్‌రావు.. గతంలో చంద్రబాబు తమ బాస్ అని.. మళ్లీ అవకాశం వస్తే రాజ్యసభకు వస్తానని రాజీనామా చేసిన సందర్భంగా పేర్కొన్న విషయం విదితమే.. మరోవైపు.. తాను టీడీపీలో చేరనున్నట్టు.. అందులో దాచాల్సిన విషయం ఏమీ లేదని.. రాజీనామా చేసిన సందర్భంగా మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు.. రాజకీయాల్లో పార్టీలు మారడం సహజమేనని.. వైఎస్ జగన్ తనకు వైసీపీలో 100 శాతం సహకరించారని.. అయితే, కొన్ని సందర్భాలు, అంశాల్లో విభేదాలు వచ్చాయి.. కాబట్టి పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చి రాజీనామా చేసినట్టు మోపిదేవి పేర్కొన్న విషయం విదితమే.. ఇక, ఈ రోజు ఇద్దరు మాజీ ఎంపీలో టీడీపీలో చేరనుండగా.. మరికొందరు నేతలు త్వరలోనే పసుపు కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.. సైకిల్ పార్టీతో వైసీపీ నేతలు పలువురు టచ్‌లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!