రాజధాని అమరావతికి రైల్వేలైన్ వెళ్లే పలు గ్రామాల రైతులు, స్థానిక ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు మంత్రి నారాయణ.. రైతుల డిమాండ్లు, విజ్ఞప్తులను విన్న ఆయన.. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.. ఈ సమావేశానికి పెదకూరపాడు, తాడికొండ ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, శ్రావణ్ కుమార్, కర్లపూడి, పెదపరిమి, తాడికొండ, నిడుముక్కల గ్రామాల రైతులు హాజరయ్యారు..
ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ (ఎక్స్‌లో పోస్టు) ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్.. ‘మోడీ నాపై చూపే అభిమానం.. ఆప్యాయత ఎంతో విలులైనది.. పార్లమెంటు సమావేశాల మధ్య తన విలువైన సమయాన్ని నా కోసం కేటాయించారు.. గాంధీనగర్‌లో మోడీతో నా తొలి సమావేశం నుంచి ఈ భేటీ వరకు, మోడీకి పని పట్ల నిబద్ధత, దేశం పట్ల ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకం’ అంటూ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు.. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ప్రత్యేక…
నార్కోటిక్ కట్టడిపై సబ్ కమిటీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.. గంజాయి విక్రయించే వారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని హెచ్చరించారు.. గంజాయి, డ్రగ్స్ పై ఇక యుద్ధమే అని ప్రకటించిన మంత్రి లోకేష్.. నిర్మూలనకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉక్కుపాదం మోపుతాం అన్నారు.. నార్కోటిక్స్ నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్.. ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఇకపై ఈగల్ గా…
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు నాయుడు.. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.. బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. అయితే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయిన ఘటనలో ఒకరు చనిపోగా, ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని... వారిని క్రిటికల్ కేర్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు తెలిపారు అధికారులు.
బూడిద లోడింగ్, తరలింపు వ్యవహారం కూటమి నేతల మధ్య చిచ్చు పెట్టింది.. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద తరలింపు, సరఫరాపై వివాదం రోజురోజుకు ముదురుతోంది.. బూడిద తరలింపు విషయంలో రాజకీయ వివాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇరు పార్టీల నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని మండిపడ్డారు..
ఆంధ్రప్రదేశ్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. "సాస్కి-2024-25 (Special Assistance to States for Capital Investment)"ద్వారా తొలి విడత నిధులు విడుదల చేసింది.. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ కార్యాలయం.. ఏపీలో పర్యాటక అభివృద్ధికి నూతనోత్తేజం.. మంత్రి కందుల దుర్గేష్ కృషితో, ప్రత్యేక చొరవతో కేంద్రం నుండి నిధులు విడుదల అయ్యాయని.. రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకమైన "సాస్కి-2024-25 (Special…
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, అదానీ సోలార్ ప్రాజెక్టు అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పరిశీలిస్తున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పవన్, ఢిల్లీ పర్యటనలో భాగంగా, ఉప రాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో భేటీ అయిన పవన్, మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలపై ధ్వజమెత్తారు. Adani Group: అమెరికాలో…
APSRTC : ఖరీదైన చీర మాయం కావడంతో ఆర్టీసీ అధికారుల మెడకు చుట్టుకుంది. చీర ఎక్కడుందో తెలియక కార్గో ఉద్యోగులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆర్టీసీ కార్గో సర్వీసులను నిర్వహిస్తోంది. పార్శిళ్లను సకాలంలో పంపిణీ చేస్తుండటంతో చాలామంది ఆర్టీసీ కార్గో సేవల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వినుకొండ డిపోకి రావాల్సిన పార్శిల్ రాకపోవడంతో కార్గో ఉద్యోగులు హైరానా పడుతున్నారు. ఎందుకంత హైరానా అనుకుంటున్నారా..! Hyderabad: నగరంలో వరుస అగ్నిప్రమాద ఘటనలు.. నిన్న జీడిమెట్ల,…
Cyclone Fengal: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు (బుధవారం) తుఫానుగా మారుతుంది. దీంతో తమిళనాడు, పుదుచ్చరిలకు భారత వాతవావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.