Tomato Price: టమోటా ధర భారీగా పతనం అయ్యింది.. దీంతో.. రైతుల్లో ఆందోళన మొదలైంది.. బహిరంగ మార్కెట్ ప్రస్తుతం కిలో 20 నుంచి 30 రూపాయల వరకు పలుకుతుండగా.. ఒకేసారి భారీగా పతనమైంది.. టమోటా మార్కెట్‌కు పెట్టింది పేరైన కర్నూలు జిల్లాలోని పత్తికొండ టమోటా మార్కెట్‌లో ఈ రోజు కిలో టమోటా ధర ఒక్క రూపాయికి పడిపోయింది.. దీంతో, పెట్టుబడు, కిరాయిలు.. ఇలా ఏవీ దక్కకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.. కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అయితే, హైదరాబాద్ మార్కెట్‌లో డిమాండ్ లేకపోవడంతోనే టమోటా ధర తగ్గిందంటున్నారు వ్యాపారులు.. కానీ, మద్దతు ధర లేదని రైతుల ఆవేదన చెందున్నారు.. నిన్నటి దాకా బయటి మార్కెట్ లో కిలో టమోటా రూ.30 వరకు పలికింది.. కానీ, ఉన్నట్టుండి రూపాయికి పతనం కావడంతో.. ఎంతో కష్టపడి టమోటా పండించి.. మార్కెట్‌కి చేర్చితే.. కనీసం కూలీ డబ్బులు కూడా రావడం లేదు.. టమోటాను మార్కెట్‌కి తరలించే రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ రైతులు కన్నీరు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
Read Also: Manchu Manoj: మనోజ్ కోసం మోహన్ బాబు నివాసానికి ఆళ్లగడ్డ బ్యాచ్?
కిలో టమోటా ధర రెండు రూపాయలు కూడా పలకకపోవడంతో టమోటా రైతులు ఆందోళన చెందుతున్నారు. నిన్న మొన్నటిదాకా కిలో పది రూపాయలు నుండి 20 రూపాయలు పలికిన టమోటా ధర ఒక్కసారిగా కుప్పకూలడంతో టమోటా రైతులు లబోదిబోమంటున్నారు. గత కొద్ది రోజుల కిందట జత బాక్స్ 1500 నుండి 2000 పలికిన టమోటా ధర ప్రస్తుతం జత బాక్సు50 నుండి 100 కూడా ధర లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమోటా రైతుల దుస్థితి లాటరీ లాగా తయారయిందని కనీస రవాణా ఖర్చులు కూడా రావడంలేదని టమోటా తెంచిన కూలీలు కూడా రావడంలేదని రైతులు మండిపడుతున్నారు. హైదరాబాద్ టమోటా రావడంతో పత్తికొండ టమాటాకు ధర పలకడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరో వారం రోజుల్లో టమోటా ధర లేకపోతే మార్కెట్ బంద్ పరిస్థితి ఉందని మార్కెట్ వ్యాపారులు అంటున్నారు.