ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తామని.. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని తెలిపారు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు.. గత వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో 5 వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేజీ నుండి పీజీ వరకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తాం అన్నారు మంత్రి నారా లోకేష్.. బాపట్లలో మెగా పేరెంట్స్ టీచర్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లల్లో నేను దేవుడ్ని చూస్తాను.. ప్రతి పిల్లవాడి అభివృద్ధి వెనుక వాళ్ల తల్లిదండ్రులు ఉంటారు.. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల అభివృద్ధి కోసం.. విద్యార్థుల తల్లిదండ్రులతో.. ఉపాద్యాయులతో కలిపి సమావేశం పెట్టాం అన్నారు.
అమరావతిలో భవనాలను పునఃప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. డిసెంబర్ 15వ తేదీ నుండి బిల్డింగ్ యాక్టివిటీని ప్రారంభించనుంది.. ఎంపిక చేసిన కొన్ని కన్స్ట్రక్షన్ మేజర్లకు వివిధ ప్రాజెక్ట్ వర్క్‌లు అప్పజెప్పనున్నారు.. ఇక, పాత కాంట్రాక్టులను రద్దు చేసి తాజాగా బిడ్లను ఆహ్వానించేందుకు ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిన విషయం విదితమే.. కానీ, సాధ్యమైనంత వరకు పాత కాంట్రాక్టర్ల తోనే పని జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు.. బిడ్డింగ్ ప్రక్రియకు అధికారిక గడువు త్వరలో ముగియగానే ఎంచుకున్న…
Ration Mafia : ఏపీలో రేషన్ మాఫియాకు చెక్ పెట్టేందుకు సిట్ రంగంలోకి దిగింది. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా పై సిట్ ఏర్పాటైంది. దీంతో మాఫియా గుండెల్లో గుబులు మొదలయ్యాయి. ప్రస్తుతం స్టెల్లా నౌక నుంచి సేకరించిన బియ్యం నమూనాలను పరిశీలిస్తూ సిట్ విచారణ వేగంగా సాగే అవకాశముంది. అక్రమాలకు అండదండగా ఉన్న పెద్దలపాత్ర త్వరలో బయటపడే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్న అన్ని పోర్టులలోనూ కాకినాడ పోర్టు వివాదాలతో చిక్కుకుంది. కాకినాడ…
Flights Diversion : కృష్ణా జిల్లాను పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అలాగే గన్నవరం ఎయిర్‌పోర్టు (Gannavaram Airport) వద్ద కూడా భారీగా పొగమంచు కమ్మేసింది. దీంతో విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. పొగమంచు కారణంగా క్లియరెన్స్ లేక గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద పలు విమానాలు గాలిలోనే చక్కర్లు కొడుతున్నాయి. పొగమంచు కారణంగా సుమారు గంట నుంచి ఫ్లైట్స్ గాల్లోనే చక్కర్లు కొడుతున్న పరిస్థితి. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాల…
Egg Prices: ప్రస్తుతం కొడిగుడ్డుకు రెక్కలొచ్చాయి. ఒక్క గుడ్డు చిల్లర ధర ఏకంగా 7 రూపాయలను దాటేసింది. కార్తీకమాసం ముగియడంతో.. గుడ్డు ధర అమాంతం పెరిగిపోయింది.
Minister Narayana : నెల్లూరు నగరంలోని బి.వి.ఎస్. నగరపాలక సంస్థ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజున తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా ప్రాధాన్యమిస్తోందని, రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రాంతాల్లో మోడల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రి నారాయణ. కార్పొరేట్ స్కూల్స్ విజయానికి కారణం తల్లిదండ్రులు..…
Weather Updates : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, ఆగ్నేయ బంగాళాఖాతం , దానిని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రంలో ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ పశ్చిమ-వాయువ్య దిశలో కదులుతుందని అంచనా వేయబడింది , డిసెంబర్ 12 నాటికి శ్రీలంక , తమిళనాడు తీరాలకు చేరుకోవచ్చు. ఈ పరిణామం తమిళనాడు , ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో రాబోయే కొద్ది…
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. లాడ్జిలో ఉరివేసుకొని ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సీపట్నంలోని కేఎన్ఆర్ లాడ్జిలో ఆర్మీ జవాన్ ఫ్యానుకు ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు