* ఢిల్లీ: నేడు, రేపు లోకసభలో రాజ్యాంగంపై రెండు రోజుల చర్చ.. చర్చ కోసం రేపు (శనివారం) ప్రత్యేకంగా సమావేశంకానున్న లోకసభ.. రేపు (శనివారం) రాజ్యసభకు సెలవు.. సోమ, మంగళవారం (డిసెంబర్ 16, 17) రాజ్యసభలో రాజ్యాంగం పై రెండు రోజులు చర్చ. లోకసభలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యాంగం పై ప్రత్యేక చర్చ ప్రారంభం.
* నేడు బెజవాడలో సీఎం చంద్రబాబు పర్యటన.. విజన్ 2047 విడుదల చేయనున్న చంద్రబాబు
* అమరావతి: నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేత కార్యక్రమం.. రైతుల సమస్యలు కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ ఆందోళన
* ప్రకాశం : మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ అమరావతిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు..
* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరిట నిరసన కార్యక్రమం, హాజరుకానున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్..
* ప్రకాశం : చీమకుర్తిలో సీపీఎం జిల్లా మహాసభలు, హాజరుకానున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు..
* ప్రకాశం : రాచర్ల మండలం చోళ్ళవీడులో రెవెన్యూ సదస్సులో పాల్గొననున్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి.
* బాపట్ల : అద్దంకి మండలం ప్రసిద్ధ శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ వ్రతం – దీక్ష విరమణ సందర్భంగా ప్రత్యేక పూజలు..
* ప్రకాశం : ఒంగోలులో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ ను మరోసారి విచారించనున్న ఎస్పీ ఎఆర్ దామోదర్.. ఇవాళ ఉదయం పది గంటల నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు ఒంగోలులోని పోలీసు కార్యాలయంలో విచారణ చేపట్టనున్న ఎస్పీ ఎఆర్ దామోదర్..
* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం
* గుంటూరు: నేడు ఉమ్మడి జిల్లా లో, వైసీపీ ఆధ్వర్యంలో ,కలెక్టరేట్ ల వద్ద ధర్నా .. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరు దర్నా చౌక్ వద్ద ఉదయం 10 గంటల నుండి వైసిపి ఆధ్వర్యంలో నిరసన.. రైతు సమస్యలపై గుంటూరు కలెక్టర్ కు వినతిపత్రం అందించనున్న మాజీమంత్రి అంబటి రాంబాబు…
* మంత్రులు నారాయణ.. ఆనం రామనారాయణ రెడ్డి లు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
* నెల్లూరు: రైతుల సమస్యలను కోరుతూ కలెక్టరేట్ వద్ద వై.సి.పి.ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
* తిరుపతి: భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించిన జిల్లా ఇంచార్జి కలేక్టర్ భన్సల్
* అనంతపురం : రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వ్తెసీపీ ఆధ్వర్యంలో జడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ.
* శ్రీ సత్యసాయి : నేటి నుంచి పెనుకొండ బాబయ్య స్వామి ఉరుసు ఉత్సవాలు ప్రారంభం. ప్రభుత్వం తరుపున చాదర్ సమర్పించనున్న మంత్రి సవిత.
* అనంతపురం : కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా.
* నేడు కర్నూలు, నంద్యాల లో కలెక్టరేట్ల ముందు వైసీపీ ఆందోళన.. పాల్గొననున్న మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ శ్రేణులు
* నంద్యాల: మహానంది క్షేత్రంలో నేడు కామేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ , కుంకుమార్చనలు , సాయంత్రం పల్లకీ సేవ, హుండీ లెక్కింపు
* నంద్యాల: నేడు నందికొట్కూరులో ఎమ్మార్పీఎస్ భవనాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్యే గిత్తా జయసూర్య…
* అనంతపురం : గుంతకల్లు కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ వ్రత్ దీక్ష విరమణ పూజా కార్యక్రమం.
* నేడు పార్వతీపురం వైసీపీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై కలెక్టర్ కు రైతుల సమస్యలపై వినతి పత్రం ఇవ్వనున్న వైసీపీ శ్రేణులు
* నేడు పోటాపోటీగా చిత్తూరులో వైసీపీ, టీడీపీ ర్యాలీలకు పిలుపు.. రైతు సమస్యలు తీర్చాలని, సూపర్ సిక్స్ అమలు పరచాలని డిమాండ్ తో గిరింపేట నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్ర ర్యాలీని ప్రకటించిన వైసీపీ
* విజయనగరం: వైసీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నేడు జిల్లా పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావ అధ్యక్షతన రైతులు ఎదుర్కుoటున్న సమస్యలపై జిల్లా కల్లెక్టర్ కి వినతి పత్రం..
* కడప : పోలీసుల అదుపులో ఆంజనేయ ప్రసాద్ దంపతులు… రాత్రి చెన్నై ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకున్న కడప పోలీసులు… నేడు కోర్టు లో హాజరు పెట్టనున్న పోలీసులు…
* ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత.. సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 10.1, న్యాల్కల్ 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. మెదక్ జిల్లా దామరంచలో 11.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.. సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 12.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
* నిర్మల్: నేడు జిల్లా లో మంత్రి సీతక్క పర్యటన. ఉదయం బాసర సరస్వతి అమ్మవారి దర్శనం, ఆతరువాత కార్యకర్తల సమావేశం. మధ్యాహ్నం బాసర ట్రిపుల్ ఐటీ కి వెళ్లనున్న మంత్రి.
* ఆదిలాబాద్ జిల్లా పై చలి పంజా. సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్ జిల్లా సోనాల లో 8.3 డిగ్రీలు*గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. కొమురం భీం జిల్లా సిర్పూర్ యు లో 8.6గా నమోదు. నిర్మల్ జిల్లా పెంబి లో 9.8.. మంచిర్యాల జిల్లా తపాలా పూర్ లో 12.8గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. రాష్ట్రంలో నే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలో నే నమోదు
* నంద్యాల: బనగానపల్లె లోని శ్రీ హట్టి ముని స్వామి ఆశ్రమంలో నేడు ఆరాధన మహోత్సవాలు
* కడప : రేపు సాగునీటి సంఘాలకు ఎన్నికలు.. 14న చెరువులు, 17న డిస్ట్రిబ్యూటరీ సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు.. కడప జిల్లాలో 206, అన్నమయ్య జిల్లాలో 167 సాగునీటి సంఘాలకు జరగనున్న ఎన్నికలు..
* సంగారెడ్డి: నేడు మల్కాపూర్ చెరువులో నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్.. యుద్ధ ట్యాంకర్లను తయారుచేసిన ఎద్దు మైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ.. ట్రయల్ రన్ అనంతరం భారత సైన్యానికి అప్పగించనున్న అధికారులు