ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో జరగని విధంగా మెగా పేరెంట్ మీటింగ్ చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవబోతోంది. ఏపీ వ్యాప్తంగా రేపు మెగా పేరెంట్ టీచర్ మీట్ జరగనుంది. 44,303 పాఠశాలల్లో ఒకేరోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహిస్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు అనుసరిస్తున్న విధానం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలోని నాలుగు పంచాయతీలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. అత్యుత్తమ పనితీరును కనబరిచిన పంచాయతీలకు కేంద్ర సర్కారు ఇచ్చే జాతీయ స్థాయి పురస్కారాలుకు నాలుగు గ్రామాలు ఎంపిక కావడం విశేషం.
కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ స్వామివారు, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ షష్టి మహోత్సవాలను ప్రారంభించారు.
వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి కబ్జాలకు పాల్పడ్డారని మంత్రి నారాయణ తీవ్రంగా విమర్శించారు. సెంటు భూమి నుంచి వేల ఎకరాల వరకూ వైసీపీ ప్రభుత్వంలో కబ్జా జరిగిందన్నారు. పరిశ్రమలు, పోర్టులను సైతం కబ్జా చేశారని ఆరోపించారు. గత అరాచక ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, నాయకులు దోపిడీ చేశారని ఆయన విమర్శలు గుప్పించారు.
ఏపీలో ఈ రోజు రెవెన్యూ గ్రామ సభలు ప్రారంభమయ్యాయి.. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోంది.. అయితే, నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి పల్లెలో నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక, సీఎం సహాయ నిధికి, సంబంధించి స్థానిక వీఆర్వో గంగన్న తనను 2 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడని, గ్రామ సభలో ఓ మహిళ మంత్రికి ఫిర్యాదు…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.. అయితే, ఉన్నట్టుండి ఆయన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.. పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఎంపీ సాయిరెడ్డి ట్వీట్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది..
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన కూతరు సునీతరెడ్డి.. ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి హైకోర్టు జారీ చేసిన బెయిలు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. అంతేకాకుండా వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ మరో పిటిషన్ వేసింది సీబీఐ.. ఇక, సునీత రెడ్డి, సీబీఐ పిటిషనల్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.. మరోవైపు తదుపరి…
టెక్నాలజీ మన జీవితంలో భాగమైపోయిందన్నారు సీఎం చంద్రబాబు.. టెక్నాలజీ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతోందన్న ఆయన.. సాంకేతికతతో అనేక మార్పులు వస్తున్నాయన్నారు.. ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మార్చాలని అనుకుంటున్నాం అన్నారు.. ఇప్పుడు డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణగా అభిర్ణించారు.. ఇక, ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త, ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలనే నినాదం తీసుకున్నామని వెల్లడించారు ఏపీ సీఎం..
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి సురేష్ గోపీ నోట తెలుగు పాట వచ్చింది.. సామజవరగమనా.. అంటూ పాట పాడుతూ.. తన ప్రసంగాన్ని ప్రారంభించారు కేంద్ర సహాయమంత్రి సురేష్ గోపీ.. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో పాల్గొన్నారు సురేష్ గోపీ. తెలుగు సినిమా చాలా అద్భుతం అన్నారు సురేష్ గోపీ.. తెలుగు వాళ్లకి నేను అవకాశాలు ఇస్తాను.. తెలుగు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, నటులు చాలా ప్రభావం చూపిస్తారంటూ ప్రశంసలు కురిపించారు.. తెలుగు స్క్రిప్ట్…