నేడు స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ విడుదల.. బెజవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు బెజవాడలో పర్యటించనున్నారు.. విజన్ 2047 రిలీజ్ సందర్భంగా చంద్రబాబు సభలో ప్రసంగించనున్నారు. ఇక, సీఎం సభ సందర్భంగా బెజవాడలో ఈ రోజు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు.. బందరు రోడ్డులో పూర్తిగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉండనున్నట్లు పోలీసులు వెల్లడించారు. 24 చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసిన అధికారులు.. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పేర్కొన్నారు.
నైట్ షిఫ్ట్‌లో మహిళా హోంగార్డుకు వేధింపులు..! హెడ్ కానిస్టేబుల్‌పై వేటు..
రాజమండ్రిలోని బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో మహిళా హోంగార్డు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్‌పై సస్పెండ్ వేటు పడింది.. ఈ నెల 8వ తేదీన నైట్ డ్యూటీలో ఉంటూ అర్ధరాత్రి సమయంలో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ మద్యం సేవించి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.. అదే సమయంలో స్టేషన్ లో ఉన్న మహిళా హోంగార్డుతో అసభ్యంగా మాట్లాడి చెయ్యి పట్టుకునేందుకు హెడ్ కానిస్టేబుల్ ప్రయత్నించినట్టు.. ఆ మహిళా హోంగార్డు ఆరోపిస్తోంది.. అయితే, ఆ అసభ్య ప్రవర్తనను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించింది మహిళా హోంగార్డు.. దీంతో.. పోలీస్ స్టేషన్ నుంచి తిరిగి వెళ్లిపోయాడు హెడ్ కానిస్టేబుల్.. ఈ మేరకు భర్తతో కలిసి బాధిత మహిళా హోంగార్డు జిల్లా ఎస్పీ నరసింహా కిషోర్ కి ఫిర్యాదు చేసింది. తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన దృశ్యాలను కూడా ఎస్పీకి చూపించారు.. ఆ సెల్ ఫోన్ దృశ్యాలను చూసి హెడ్ కానిస్టేబుల్ పై కేసు నమోదుచేసి, సస్పెండ్ చేశారు జిల్లా ఎస్పీ. ఈ మేరకు కేసు నమోదు చేసి.. పోలీసులు అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు . కాగా, అందరికీ భద్రత కల్పించాల్సిన పోలీసులే.. అది కూడా పోలీస్ స్టేషన్‌లోనూ.. ఓ మహిళా హోంగార్డు పట్ల ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెళ్లివెత్తాయి.. డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మందు కొట్టి పీఎస్‌కు రావడంపై మండిపడుతున్నారు..
ఏపీలో భారీ వర్షాలు.. ఆ రెండు జిల్లాల్లో నేడు స్కూల్స్, కాలేజీలు బంద్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. కొన్ని చోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి.. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వాగులు వంకలు, నదలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.. భారీ వర్షాలకు కాళంగి రిజర్వాయర్, అరణియార్ ప్రాజెక్ట్ నుండి నీటిని విడుదల చేశారు అధికారులు.. జిల్లాలోని మిగిలిన ప్రాజెక్టుల్లోనూ.. డ్యామ్‌లలోనూ పూర్తిస్థాయిలో నీటి నిలువ చేరుకున్నాయి. అయితే, భారీ వర్షాలు.. వాగులు వంకల పొంగిపొర్లుతోన్న నేపథ్యంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.. ఈ జిల్లాల పరిధిలోని స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీ సెంటర్లు మూతపడ్డాయి.. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ రోజు విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు జిల్లా ఇంచార్జి కలేక్టర్ భన్సల్.. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించినట్టు పేర్కొన్నారు..
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు..
మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరం రానుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం చాలా మంది ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నారు. ఎక్కడికెళ్లాలి, ఏం చేయాలి అనే కార్యక్రమాలను ఫిక్స్ చేసుకుంటున్నారు. అదేవిధంగా రిసార్టులు, హోటళ్లు, పబ్బులు, వ్యాపార సంస్థలు ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎంతో ఉత్సాహంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు రకరకాల కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు తమ పనిలో పడ్డారు. న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించే వివిధ వేడుకలకు హైదరాబాద్ పోలీసులు పలు నిబంధనలు విధించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లలో ఈవెంట్‌ల నిర్వాహకులందరూ తప్పనిసరిగా పాటించాల్సిన పలు నిబంధనలను పోలీసులు వివరించారు.
భూదాన్ భూముల స్కామ్.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు..
భూదాన్ భూముల స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నాగర్‌కర్నూలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆమోద డెవలపర్స్‌కి చెందిన సూర్య తేజతో పాటు కె.ఎస్.ఆర్ మైన్స్ కు చెందిన సిద్ధారెడ్డి ఈ స్కామ్ లో లాభ పడినట్లు ఈడీ గుర్తించింది. ఇస్కాన్ లో ఇప్పటికే ఐఏఎస్ అమోయ్ కుమారును పలుమార్లు విచారించింది. తాజాగా నలుగురికి నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 16న హాజరుకావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. మేడ్చల్ జిల్లాల్లో అమోయ్ కుమార్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో జరిగిన భూ లావాదేవీలపై బాధితులు ఈడీ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఈడీ ఇప్పటికే అమోయ్ కుమార్‌ను పలుమార్లు ప్రశ్నించింది. రూ.కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఇతరులకు కేటాయించడంపై 5 రోజులుగా ప్రశ్నించారు. ఈ మేరకు అమోయ్ కుమార్, మహేశ్వరం తహశీల్దార్ వాంగ్మూలాలను నమోదు చేశారు. వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అప్పటి ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్ జ్యోతితోపాటు మరో నలుగురికి నోటీసులు జారీ చేశారు. వారు ఇచ్చిన కీలక పత్రాల ఆధారంగా రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి భూ ఆక్రమణలపై పూర్తి ఆధారాలను ఈడీ సేకరించి డీజీపీకి నివేదిక సమర్పించింది. ఇక తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
నేడు పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ..
భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75 సంవత్సరాలు అయినా సందర్భంగా పార్లమెంటులోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ కొనసాగనుంది. ఈరోజు (డిసెంబర్ 13) లోక్‌సభలో ఉదయం జీరో అవర్ ముగిసిన తర్వాత కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీనిని స్టార్ట్ చేయనున్నారు. ఇది శనివారం వరకు కొనసాగనుంది.. ఈ చర్చకు ముగింపుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆన్సర్ ఇవ్వనున్నారు. అలాగే, ఈ నెల 16వ తేదీన ప్రత్యేక చర్చను హోంమంత్రి అమిత్ షా ఆరంభిచనున్నారు. 17న ప్రధాని మోడీ ముగింపు ప్రసంగం చేయనున్నారు. అయితే, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగంపై చర్చ జరగాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికార ఎన్‌డీఏ, ఇండియా కూటమిల మధ్య ఒప్పందం చేసుకున్నారు. 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ పరిషత్ కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
భారత్లోని సిరియన్ ఎంబసీలో కొత్త తిరుగుబాటు జెండా ఆవిష్కరణ
అరబ్ రిపబ్లిక్‌లో బషర్ అల్-అస్సాద్ పాలనను తిరుగుబాటు దళాలు కూల్చివేశాయి. దీంతో తాజాగా, న్యూఢిల్లీలోని సిరియన్ ఎంబసీలో రెబల్స్ యొక్క కొత్త జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక, ఈ జెండాను ఎగురవేయడంతో సిరియాలో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు తెలుస్తుంది. అయితే, ఆ జాతీయపతాకంలో ఆకుపచ్చ-తెలుపు-నలుపు-ఎరుపు రంగులతో రూపొందించారు. ఒకప్పుడు ప్రతిఘటనకు చిహ్నంగా ఈ జెండా ఉండేది. సిరియన్ అంతర్యుద్ధంలో ఇది బాగా గుర్తింపు పొందింది. ఇప్పుడు అసద్ పాలన పతనానికి ముగింపు పలికిన తర్వాత సిరియా అధికారిక జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేసింది. ఈ మార్పుతో అసద్ కుటుంబం యొక్క 50 సంవత్సరాల పాలనకు స్వస్తి పలికినట్లు పేర్కొన్నారు. అయితే, పాలనలో మార్పుతో పాటు కొత్త జాతీయ జెండాను రూపొందించడంతో సిరియలో వేడుకలు జరుపుకున్నారు. బెర్లిన్, ఇస్తాంబుల్, ఏథెన్స్ వంటి నగరాల్లో కొత్త జెండాతో ర్యాలీలు తీశారు. అలాగే, సిరియాలో అధికారం దక్కించుకున్న తిరుగుబాటుదారులకి తమ మద్దతును తెలియజేసేందుకు జనాలు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఇక, భారతదేశంలోని సిరియన్ ఎంబసీలో జెండా మార్పుతో పాటు దేశంలో మారుతున్న రాజకీయ గుర్తింపుకు స్పష్టమైన సూచనగా పని చేస్తుంది.
విరాట్ కోహ్లీ.. ఒకే ఒక్క సెంచరీ! ఇదే చివరి అవకాశం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 భాగంగా డిసెంబరు 14 నుంచి గబ్బా వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది. పెర్త్ టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించగా.. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్స్ తేడాతో జయకేతనం ఎగురవేసింది. ప్రస్తుతం 1-1 సిరీస్ సమంగా ఉన్న నేపథ్యంలో గబ్బా టెస్ట్ కీలకంగా మారింది. ఈ టెస్టులో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. మూడో టెస్ట్ జరగనున్న గబ్బాలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదితే.. ఓ అరుదైన ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకుంటాడు. ఆస్ట్రేలియాలోని ఐదు ప్రధాన స్టేడియాల్లో సెంచరీలు చేసిన మూడో విదేశీ ఆటగాడిగా విరాట్ నిలుస్తాడు. ఇప్పటివరకు టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్, ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ అలిస్టర్ కుక్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. 1977లో బ్రిస్బేన్, పెర్త్, మెల్‌బోర్న్.. 1985లో అడిలైడ్, సిడ్నీలో సన్నీ సెంచరీలు చేశాడు. 2006లో పెర్త్.. 2010-11లో బ్రిస్బేన్, అడిలైడ్, సిడ్నీ.. 2017లో మెల్‌బోర్న్‌లో కుక్ శతకాలు బాదాడు.
ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన మెకానిక్ రాకీ.. ఎక్కడంటే..?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ముద్దుగుమ్మలు మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ గా నటించిన చిత్రం మెకానిక్ రాకి, నూతన దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ గత నెల 22న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ముందు రోజు ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ బాగున్నప్పటికి బాక్సాఫీస్ పరంగా ప్లాప్ గా నిలిచింది. సెకండ్ హాఫ్ బాగున్నప్పటికీ ఫస్ట్ హ్లాఫ్ టతేలిపోవడంతో ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా ఎక్కలేదు. భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ సినిమా అటు బయ్యర్స్ కు నష్టాలే మిగిల్చింది. రిలీజ్ అయిన మొదటి వారంలోనే థియేటర్స్ రన్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ఇపుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ చిత్రం ఓటీటీ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ విడుదలకు ముందుగానే కొనుగోలు చేసారు. ఈ శుక్రవారం నుండి ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది అమెజాన్. జేక్స్ బిజొయ్ సంగీతం అందించిన ఈ సినిమాను ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రజనీ తాళ్లూరి నిర్మించారు. ఎలాగూ వీకండ్ వస్తుంది థియేటర్స్ లో కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు, ఈ వారాంతానికి మెకానిక్ రాకిని చూస్తూ ఎంజాయ్ చేయండి.
సాయిదుర్గ తేజ్ ఊచకోత చూస్తారు : రామ్ చరణ్
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తాజా చిత్ర కార్నేజ్ లాంచ్ ఈవెంట్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ ‘అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న డైరెక్టర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ కి, అలాగే మేము ఎంతగానో గుండెల్లో పెట్టుకొని ప్రేమించే మా అభిమానులందరికీ పేరుపేరునా నమస్కారం. ముందుగా తేజ్ కి కంగ్రాచ్యులేషన్స్. ఒక ఫైటర్ లా ఈ టెన్ ఇయర్స్ ని పూర్తి చేశాడు. ఇది బ్యూటిఫుల్ జర్నీ. తేజ్ ఒక మంచి యాక్టర్ మాత్రమే కాదు మంచి వ్యక్తి. . మీ అందరి సపోర్ట్ వల్లే తను ఇక్కడ ఉన్నాడు. తేజు ఈరోజు ఇక్కడ ఎలా నిలిచి ఉండటానికి కారణం అభిమానుల బ్లెస్సింగ్స్. ఇది తనకి పునర్జన్మ. ఈ జన్మ అభిమానులే ఇచ్చారు. ఆ సమయాన్ని మళ్లీ గుర్తు చేసుకోవాలని నాకు లేదు. కానీ ఆ మూడు నెలలు మాకు చాలా కష్టమైన సమయం. అంత పెద్ద యాక్సిడెంట్ తర్వాత తేజు మళ్లీ ఇక్కడ నిల్చున్నాడు అంటే తిను మా తేజ్ కాదు మీ తేజు. మీ అందరికీ తేజ్ తరఫున, మా విజయ అక్క తరపున పేరుపేరునా ధన్యవాదాలు. ఇది తేజుకి 18 ఫిల్మ్. సంబరాల ఏటిగట్టు. అందరికీ ఒకటే మాట చెబుతున్నా. తేజు ఊచకోత ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూడబోతున్నారు. ఔట్ స్టాండింగ్ విజువల్స్. రోహిత్ గారికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్తున్నాను. తేజు ప్రేమ చాలా బండ ప్రేమ. ఒక్కసారి పట్టుకుంటే ఊపిరి కూడా ఆడదు. అంత గట్టిగా ప్రేమిస్తాడు. ఈ సినిమాతో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి మంచి న్యూస్ కూడా వినిపించాలని కోరుకుంటున్నాను. థాంక్యూ. లవ్ యూ ఆల్’ అన్నారు.