YSRCP Protest: ఆంధ్రప్రదేశ్‌లో పోరుబాట పట్టింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్యాచరణ ప్రకటించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, అందులో భాగంగా.. నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేత కార్యక్రమం చేపట్టారు.. రైతుల సమస్యలు కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న వైసీపీ.. రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. పెట్టుబడి, గిట్టుబాటు ధర.. ఉచిత పంటల బీమా రద్దుతో కూటమి ప్రభుత్వం అన్నదాతను దగా చేస్తోందని మండిపడుతున్నారు.. అయితే, పలు చోట్ల ఈ కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి..
Read Also: AUS Playing XI: మూడో టెస్టుకు ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన.. డేంజరస్ బౌలర్ వచ్చేశాడు!
అనంతపురం నగరంలో రైతులకు అండగా వైసీపీ నిరసన కార్యక్రమం చేపట్టగా.. వైసీపీ నిరసన కార్యక్రమానికి పోటీగా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం సృష్టిస్తోంది.. మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పేరుతో వైసీపీ నిరసన కార్యక్రమం ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు ఏం చేసింది.. టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో వివరాలతో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.. ఓవైపు వైసీపీ నిరసన కార్యక్రమం… మరోవైపు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఫ్లెక్సీ కలకలంతో అలర్ట్ అయిన పోలీసులు.. బందోబస్తు ఏర్పాటు చేశారు.. తమ నిరసన కార్యక్రమానికి పోటీగా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు..
Read Also: D Gukesh: చరిత్రకు చెక్‌మేట్ పడింది, నువ్వు ఓ అద్భుతం.. గుకేశ్‌కు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు!
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ని విజయవాడలో అరెస్ట్ చేశారు పోలీసులు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అవినాష్.. పోలీసుల తీరును తప్పుబట్టారు.. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు తగవని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రైతులకు అండగా నిలవడం తప్ప అంటూ నిలదీశారు.. అవినాష్ తో పాటు మరికొంతమంది వైసీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎక్కడకు తీసుకు వెళ్తున్నారో కూడా సమాధానం చెప్పకుండా తరలించారని వైసీపీ నేతులు ఫైర్ అవుతున్నారు.. ఇక, చిత్తూరులో పోటాపోటీగా వైసీపీ టీడీపీ ర్యాలీలు నిర్వహించాయి.. రైతు సమస్యలు తీర్చాలని , సూపర్ సిక్స్ అమలు పరచాలని డిమాండ్ తో పివికేన్ కాలేజ్ నుండి నూతన కలెక్టరేట్ వరకు వైసీపీ ర్యాలీ నిర్వహించి.. .. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం ఇవ్వనున్నారు.. ఇక, గత ప్రభుత్వంలో విద్యార్థులకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ తో పాటు రాష్ట్రాన్ని తిరోగమనం చేశారని పార్టీ ఆఫీస్ వద్ద నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైంది టీడీపీ.. రెండు పార్టీల ర్యాలీ నేపథ్యంలో నగరంలో పలు చోట్ల పికెటింగ్ ఏర్పాటు చేశారు పోలీసులు..
Read Also: Fire accident: తమిళనాడులోని ఓ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం
విశాఖలో అన్నదాతకు అండగా పేరుతో వైసీపీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది.. కనీస మద్దతు ధర, RBK పునరుద్ధరణ, తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసింది.. జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి.. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించనున్నారు వైసీపీ నేతలు.. ఇక, విజయవాడలో తన ఇంటి ముందే నిరసన చేపట్టారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. రైతులకి న్యాయం చేయాలని ఇవాళ కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేపట్టిన వైసీపీ నేతలు.. సీఎం చంద్రబాబు పర్యటన ఉండటంతో ఇంటి నుంచి బయటకు రాగానే అరెస్టు చేసేందుకు పోలీసులు ఉండడంతో ఇంటి ముందే ఆందోళన చేపట్టారు.
ఇక, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను పోలీసులు అడ్డుకున్నారు.. రైతులకు అండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో ఈ రోజు విజయవాడ కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లేందుకు సిద్ధమైన వెల్లంపల్లిని ముందుగా.. రథం సెంటర్ వినాయకడి గుడి దగ్గర పూజలు చేసిన తరువాత కలెక్టర్ కార్యాలయానికి బయల్దేరారు.. అయితే, కాళేశ్వర మార్కెట్ ఫ్లైఓవర్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ను అడ్డుకొని వెనక్కి పంపించారు పోలీసులు..