YS Avinash Reddy: సాగునీటి సంఘాల ఎన్నికలు వైఎస్‌ఆర్ కడప జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. పులివెందుల నియోజకవర్గంలోని పలు మండలాలలో రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. వేముల మండలంలో రైతులను తహసిల్దార్ కార్యాలయంలోనికి వెళ్లనికుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని ఆయన అక్కడికి చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలను తహసిల్దార్ కార్యాలయం నుంచి బయటికి పంపే వరకు తాను కూడా కదలనని పోలీస్ స్టేషన్‌లో భీష్మించుకుని కూర్చున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి.. అయితే, ఇరు వర్గాలు భారీగా మోహరించడంతో వేముల మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాగునీటి సంఘాల ఎన్నికల్లో రైతులు ఓట్లు వేస్తే గెలవలేమని భయంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారని అవినాష్ రెడ్డి ఆరోపించారు.
Read Also: Bomb Threat In Delhi: ఢిల్లీలోని మరో 3 పాఠశాలలకు బాంబు బెదిరింపులు
ఇక, ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు అవినాష్ రెడ్డి.. ఉచిత పంటల బీమాకు ఇవాళ రైతులు వద్ద నుంచి ప్రీమియం కట్టించుకుంటున్నారు.. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు… పోలీసులను అడ్డుపెట్టుకొని దద్దమ్మ రాజకీయాలు చేస్తున్నారు.. ఇటువంటి రాజకీయాలు మంచిది కాదు అని హెచ్చరించారు.. 2022వ సంవత్సరంలో జరిగిన ఎంపిటిసి, సర్పంచ్ ఎన్నికలు ఎంత ప్రజాస్వామ్య బద్దంగా జరిగాయో గుర్తుపెట్టుకోవాలి… మేం అధికారంలో ఉన్నప్పుడు మీలాగా పోలీసులను వాడలేదు.. మా ప్రభుత్వం హయాంలో టీడీపీ నాయకులు కూడా ఫ్రీగా నామినేషన్ వేసి ఎన్నికల్లో పాల్గొన్నారు.. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు అని వార్నింగ్ ఇచ్చారు.. కాగా, రేపు సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి.. జిల్లాలోని 14 చెరువులు, 17 డిస్ట్రిబ్యూటరీ సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు.. కడపజిల్లాలో 206, అన్నమయ్య జిల్లాలో 167 సాగునీటి సంఘాలకు.. రహస్య బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు.. రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడంలేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కలెక్టర్ కు లేఖ రాశారు.. రైతులు వద్ద నుంచి నీటి పన్ను కట్టించుకోవడానికి వీఆర్వోలు నిరాకరిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు అవినాష్ రెడ్డి.. అయితే, వేములలో ఉద్రిక్తత నెలకొనడంతో ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు.