Vijayawada: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు బెజవాడలో పర్యటించనున్నారు.. విజన్ 2047 రిలీజ్ సందర్భంగా చంద్రబాబు సభలో ప్రసంగించనున్నారు. ఇక, సీఎం సభ సందర్భంగా బెజవాడలో ఈ రోజు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు.. బందరు రోడ్డులో పూర్తిగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉండనున్నట్లు పోలీసులు వెల్లడించారు. 24 చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసిన అధికారులు.. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పేర్కొన్నారు.
Read Also: Game Changer : ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా సుకుమార్
విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు..
విజయవాడ వెలుపల భారీ, మద్యతరహా రవాణా వాహనాల రాకపోకల మళ్లింపులు
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం.. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపుకు భారీ, మధ్య తరహా రవాణా వాహనాల రాకపోకల మళ్లింపులు..
ఇబ్రహీంపట్నం వద్ద నుండి జి కొండూరు – మైలవరం- నూజివీడు -హనుమాన్ జంక్షన్ వైపుకు మళ్ళించ బడును. (ఇరువైపులా).
విశాఖపట్నం నుండి చెన్నై.. చెన్నై నుండి విశాఖపట్నం వైపుకు భారీ, మధ్య తరహా రవాణా వాహనాల రాకపోకల మళ్లింపులు..
హనుమాన్ జంక్షన్ బైపాస్ మీదుగా గుడివాడ – పామర్రు – అవనిగడ్డ – రేపల్లె- బాపట్ల – చీరాల – త్రోవగుంట – ఒంగోలు జిల్లా మీదుగా మళ్ళించ బడును. (ఇరువైపులా).
గుంటూరు నుండి విశాఖపట్నం.. విశాఖపట్నం నుండి గుంటూరు వైపుకు భారీ, మధ్య తరహా రవాణా వాహనాల రాకపోకల మళ్లింపులు..
గుంటూరు నుండి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను బుడంపాడు వద్ద , తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్ , పెనుమూడి బ్రిడ్జ్ మిధుగా అవనిగడ్డ, పామర్రు – గుడివాడ –హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్ళించ బడును. (ఇరువైపులా)
చెన్నై నుండి హైదరాబాద్.. హైదరాబాద్ నుండి చెన్నై వైపుకు భారీ, మధ్యతరహా రవాణా వాహనాల రాకపోకల మళ్లింపులు..
చెన్నై నుండి హైదరాబాద్ వైపు వెళ్ళే వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ళు,నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్ పల్లి మీదుగా హైదరాబాద్ వెళ్ళవలెను.. (ఇరువైపులా)