AP Crime: గుంటూరు జిల్లా నకరికల్లు డబుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. క్రైం థ్రిల్లర్‌ను తలపించిన ఈ కేసును సోదరి ప్రధాన నిందితురాలిగా తేల్చేశారు. తండ్రి సంపాదించిన ఆస్తి కోసం…అన్నదమ్ముళ్లను సొదరే చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన తండ్రికి 70 లక్షలకుపైగా ఆస్తి ఉంది. ఈ ఆస్తి వ్యవహారంలో అన్నదమ్ముళ్లు, చెల్లెలు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఆస్తి పంపకాల విషయంలో వాటాలు కుదరకపోవడంతో…చెల్లెలు కృష్ణవేణిని చంపేయాలని గోపికృష్ణ, రామకృష్ణ ప్లాన్ వేశారు. ఈ విషయం తెలుసుకున్న సోదరి కృష్ణవేణి…తనకు అడ్డుగా ఉన్న గోపికృష్ణ, రామకృష్ణలను…అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. ఇద్దర్ని చంపేస్తే…తండ్రి సంపాదించిన ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని భావించింది. ముగ్గురి ఆస్తిని తానే అనుభవించవచ్చని లెక్కలు వేసుకుంది.
Read Also: Bihar: ప్రశాంత్ కిషోర్ పార్టీలో తిరుగుబాటు.. ఇద్దరు మాజీ ఎంపీల రాజీనామా
అన్నదమ్ముళ్లను చంపేయాలని ప్లాన్ వేసిన కృష్ణవేణి…ఇద్దర్ని ఒకేసారి చంపేస్తే ఇబ్బందులు వస్తాయని అనుకుంది. ఒక్కొక్కర్ని ఒక్కోసారి చంపేయాలని వ్యూహాలను అమలు చేసింది. మొదట తమ్ముడు రామకృష్ణకు మద్యం తాగించింది. మత్తులోకి జారుకోగానే…ఇంట్లోనేచున్నితో గొంతు బిగించి హత్య చేసింది. శవం దొరికితే పోలీసులకు చిక్కుతానన్న భయంతో…డెడ్‌బాడీ దొరకుండా కెనాల్‌లో పడేసింది. తమ్ముడ్ని చంపేసిన కృష్ణవేణి…అన్న గోపికృష్ణ హత్యకు పథకం వేసింది. విభేదాలను పక్కన పెట్టి…ప్రేమగా నటించింది. సోదరుడికి నిద్రమాత్రలు ఇచ్చి…చంపేసింది. సోదరులను చంపేయడానికి ఇద్దరు మైనర్ల సాయం తీసుకుంది. పల్నాడు జిల్లా నకరికల్లు చెందిన పౌల్‌రాజ్… ప్రభుత్వ టీచరుగా పని చేశాడు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఇతనికి ముగ్గురు సంతానం. గోపికృష్ణ, కృష్ణవేణి, రామకృష్ణ. ఈమె భర్తతో తెగదెంపులు చేసుకొని…ఊర్లోనే ఉంటుంది. తండ్రి మృతి తర్వాత…వీరి మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. తండ్రికి సంబంధించిన ఆస్తులు తమకే దక్కాలని ఎవరికి వారు వాదించుకుంటున్నారు. ఒక ఇల్లు చిన్న కొడుకు రామకృష్ణకు దక్కింది. మరో ఇల్లు, తండ్రి పెన్షన్ కూతురు రావడం లేదు. దీంతో కృష్ణవేణి…ఆగ్రహంతో రగిలిపోయింది. చెల్లెలును చంపేసి…ఇద్దరు ఆస్తిని పంచుకోవాలని గోపికృష్ణ, రామకృష్ణ ప్లాన్ వేసుకున్నారు. అయితే అదును చూసి అన్నదమ్ములు లెక్క తేల్చేసింది కృష్ణవేణి.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఆస్తి కోసం గొడవకి వస్తున్న అన్నను, తమ్ముడిని…అడ్డు తొలగించుకున్నట్లు ఊర్లో వారికి చెప్పుకుంది కృష్ణవేణి. అందుకే నవంబర్ 26 నుంచి తమ్ముడు రామకృష్ణ, ఈ నెల 10 నుంచి అన్న గోపికృష్ణ కనిపించకుండా పోయారని తెలిసిన వారికి చెప్పింది. ఇది ఆ నోట ఈ నోట పాకి చివరకు పోలీసుల చేరింది. దీనిపై కృష్ణవేణిని ప్రశ్నించిన పోలీసులకు చెప్పిన మాటలు షాక్ ఇచ్చాయి. ఆస్తి వివాదాల నేపథ్యంలో తన తమ్ముడిని, అన్నను తానే లేపేశానని చెప్పడంతో పోలీసులు నివ్వెరపోయారు. మద్యం తాగించి, గొంతు బిగించి చంపడంతో షాకయ్యారు. ఆమె మాటలు నమ్మలా వద్దా అని ముందు వెనుకా ఆలోచించారు. మద్యం మత్తులో కృష్ణవేణి నిజం చెబుతుందో…అబద్ధం చెప్తుందో తెలియక అయోమయంలో పడ్డారు. కృష్ణవేణి చెప్తున్నట్లుగా నిజంగా హాత్య చేసిందా లేదంటే…ఇంకేమైనా జరిగి ఉంటుందా అని అనుమానించారు. అదృశ్యం అయిపోయిన ఇద్దరు సోదరులు, వాళ్ళ కుటుంబాలతో గొడవపడి తెగ తెంపులు చేసుకొన్నారు. తల్లి లేదు, తండ్రి లేడు, కేసు పెట్టే వాళ్ళు లేరు. డెడ్ బాడీ లు దొరకలేదు. నకిరేకల్లు డబల్ మర్డర్ కేసులో మిస్టరీని ఛేదించిన పోలీసులు… నిందితురాలు కృష్ణవేణి, ఆమె ప్రియుడు దానయ్యతోపాటు మరో నలుగురు మైనర్లను అరెస్ట్ చేశారు. అన్నదమ్ముల మృతదేహాల కోసం గాలింపు చేపట్టిన పోలీసులకు…రెండు రోజుల క్రితం ముప్పాళ్ళ ప్రాంతంలోని మేజర్ కెనాల్‌లో ఓ డెడ్‌బాడీ దొరికింది. ఇది కానిస్టేబుల్‌గా పని చేసిన గోపికృష్ణదిగా అనుమానించారు. గోరంట్ల మేజర్ కెనాల్‌లో రామకృష్ణ మృతదేహం లభ్యమైంది. ఇద్దరి డెడ్‌బాడీలకు డీఎన్‌ఏ టెస్టులు చేసి…వారిని గోపికృష్ణ, రామకృష్ణగా పోలీసులు నిర్దారించారు.