YS Jagan Praja Darbar in Pulivendula: వైఎస్‌ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తను ప్రాతినిథ్యం వహిస్తోన్న పులివెందులలో ప్రజా సమస్యలపై దృష్టిసారించారు.. దీని కోసం పులివెందులలోప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు వైఎస్ జగన్.. ఈ కార్యక్రమానికి జనం పోటెత్తారు.. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి.. సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు జగన్.. మొత్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. ఉదయం నుంచి మాజీ సీఎంకు వినతి పత్రాలు ఇవ్వడానికి జనం భారీగా తరలివచ్చారు.. కడప జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి జనం అధిక సంఖ్యలో వచ్చారు.. వాకిలి వద్ద అధిక సంఖ్యలో జనం గుమ్మికూడండంతో వారందరిని పోలీసులు క్యూ లైన్ లో నిలబెట్టారు. రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేసి జగన్ ను కలిసేలా ఏర్పాటు చేశారు..
Read Also: CRIME: గర్భం దాల్చడం లేదని భర్త బెదిరింపులు.. గొడ్డలితో నరికి చంపిన భార్య..
మాజీ ముఖ్యమంత్రి పుట్టినరోజు, క్రిస్మస్ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వైసీపీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చారు. భోజన విరామం తర్వాత మళ్లీ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని కొనసాగించారు జగన్.. మరోవైపు.. జగన్ చూసేందుకు, కలిసేందుకు కూడా భారీగా తరలివచ్చారు ప్రజలు. కాగా, నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులలో ఉన్నారు. ఈ సందర్భంగా నేడు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాలు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.