Vaibhav Sooryavanshi: అలసట లేదు, టెన్షన్ లేదు.. బీహార్ ‘బాద్‌షా’ వైభవ్ నేపథ్యం ఇది!
- ఒక్కో షాట్‌కి 100 మీటర్ల దూరం వెళ్లే సిక్సర్లు
- మైదానం నలు వైపులా బౌండరీల మోత
- వైభవ్ ముఖంలో అలసట లేదు, టెన్షన్ లేదు
- బీహార్ 'బాద్‌షా' వైభవ్ నేపథ్యం ఇది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వయసు కేవలం 14 ఏళ్లు.. కానీ చేతిలో బ్యాట్ పట్టుకున్నప్పుడు మాత్రం అనుభవజ్ఞుడిలా కనిపిస్తున్నాడు. 2026 అండర్-19 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నంత సేపు అతడి ముఖంలో చిరునవ్వు లేదు, అలసట లేదు, టెన్షన్ లేదు.. పరుగులు బాదాలనే కసి మాత్రమే కనిపంచింది. ఒక్కో షాట్‌కి 100 మీటర్ల దూరం వెళ్లే సిక్సర్లు, మైదానం నలు వైపులా బౌండరీల మోత. వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. 100 పరుగుల ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 8 ఫోర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లకు నిద్ర లేకుండా చేశాడు. మొత్తంగా 175 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు.
వైభవ్ సూర్యవంశీ ఒక మధ్యతరగతి రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించాడు. బీహార్ రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతులు అసలే ఉండవు. అంతర్జాతీయ స్థాయి స్టేడియంలు లేవు, సరైన ప్రాక్టీస్ సదుపాయాలు లేవు, ప్రభుత్వ సహకారం అంతంత మాత్రమే. వ్యవస్థలో లోపాలు, అవరోధాలు ఎన్నో ఉన్నా.. వాటన్నింటిని దాటుకుని వైభవ్ తన టాలెంట్‌తోనే ముందుకు దూసుకెళ్తున్నాడు. చిన్న వయసులోనే బీహార్‌ను ప్రాతినిధ్యం వహిస్తూ.. ఆపై భారత జట్టుకు ఎంపిక కావడం అతడి కష్టానికి దక్కిన ఫలితం. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతడి ముఖంలో ఎలాంటి ఎమోషన్ కనిపించదు. 80–90 పరుగుల వద్ద కూడా అలసట లేదనిపిస్తుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా బంతిని గాల్లోకి లేపేస్తూ స్కోర్ బోర్డును పరుగెత్తిస్తాడు. ఇదే అతడిని ప్రత్యేకంగా నిలబెడుతోంది.
Also Read
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
Also Read: Vaibhav Sooryavanshi Century: వరల్డ్‌కప్ ఫైనల్లో సెంచరీలు.. చరిత్రలో నిలిచిపోయిన ఇన్నింగ్స్‌లు ఇవే!
వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌లో పవర్ ఉంది, టైమింగ్ ఉంది. అంతకంటే ముఖ్యంగా మ్యాచ్‌పై ఆధిపత్యం చూపించే ఆత్మవిశ్వాసం ఉంది. చిన్న వయసులోనే ఇంత పరిపక్వత అంటే.. అది సహజ ప్రతిభకు నిదర్శనం అనే చెప్పాలి. క్రికెట్ పండితులు కూడా అతడిని ఆటకు షాక్ అవుతున్నారు. ‘భవిష్యత్తు స్టార్’గా అతడిని అభివర్ణిస్తున్నారు. పేదరికం, వనరుల లేమి, వ్యవస్థ లోపాలు అన్నింటిని జయించి.. ఎదిగిన ఒక బాలుడి పోరాటం. భారత క్రికెట్‌కు లభించిన ‘టారషా హువా హీరా’ (భారతదేశంకు ఓ వజ్రం దొరికింది) వైభవ్ సూర్యవంశీ. సరైన మార్గదర్శకత్వం, మద్దతు లభిస్తే.. రాబోయే రోజుల్లో అతడు దేశానికి ఎన్నో విజయాలు అందించడం ఖాయం.
తాజావార్తలు
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!