టీటీడీ ప్రతిపాదలనకు సీఎం గ్రీన్ సిగ్నల్.. తెలంగాణ ప్రజాప్రతినిధులకు గుడ్‌న్యూస్..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు.. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు.. అయితే, తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ సరైన గుర్తింపు ఇవ్వడంలేదని విమర్శలు వచ్చాయి.. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను టీటీడీ అనుమతించకపోవడం వివాదాస్పదమైంది.. అంతేకాదు.. టీటీడీ తీరుపై విమర్శలు కూడా వచ్చాయి.. శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకోవడం లేదు? అనే ప్రశ్నపై టీటీడీ ఈవో శ్యామల రావు ఆ మధ్య స్పందిస్తూ.. శ్రీవారి దర్శనానికి ఏపీ నుంచి వచ్చిన సిఫారసు లేఖలు మాత్రమే అనుమతిస్తున్నామని.. తెలంగాణ నుంచి సిఫార్సు లేఖలు తీసుకువస్తే.. చెల్లుబాటు కావని స్పష్టం చేశారు.. దీనిపై తెలంగాణ ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ మధ్యే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల అంశాన్ని పునఃపరిశీలించింది. బోర్డులోని మెజారిటీ సభ్యులు కూడా సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. దీంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు వారానికి రెండు సార్లు అనుమతించేలా నిర్ణయం తీసుకున్నారు.. ఇక, ఈ రోజు సీఎం చంద్రబాబును కలిశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. ఇకపై తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వారానికి రెండు సిఫార్సులేఖలకు అనుమతిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయానికి అంగీకారం తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. వారానికి రెండు… రూ.3 వందల దర్శనానికి సిఫార్సులేఖలకు ఏపీ సీఎం అనుమతించారు.. దీంతో.. టీటీడీ, సీఎం చంద్రబాబు.. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు శుభవార్త చెప్పినట్టు అయ్యింది..
ఏ ప్రాజెక్ట్ అయినా టీడీపీ హయాంలోనే ప్రారంభం.. సీఎం కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రాజెక్ట్ అయినా టీడీపీ హయాంలోనే ప్రారంభం అయ్యాయి అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో నది జలాల పంపిణీకి ఒప్పందం జరిగింది. ఏ ప్రాజెక్ట్ అయినా టీడీపీ హయాంలోనే ప్రారంభం అయ్యాయని.. పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభం అయ్యిందన్నారు.. అయితే, మేం మళ్లీ అధికారంలోకి వచ్చాక ఏడు మండలాలు ఇవ్వడానికి ఆ ఆర్డినెన్స్ తీసుకువచ్చాం అన్నారు.. ఎన్టీఆర్ నీళ్ల విషయంలో ముందుచూపుతో ఉంటారు.. మళ్లీ నేను వీటిని కొనసాగిస్తూన్నాను అన్నారు.. తోటపల్లి.. వెలిగొండ అన్ని ప్రాజెక్ట్‌లు నేనే ప్రారంభించాను.. ఉత్తరాంధ్రలో నీళ్లు అందుబాటులో లేవు.. కానీ, వర్షాలు ఎక్కువ.. రాయలసీమలో కరువు ఉంటుంది.. వ్యవసాయంపై ప్రభావం పడుతోందన్నారు. అనంతపురంలో హార్టీకల్చర్ బాగా పెరిగింది.. వరదలు వచ్చినప్పుడు గోదావరిలోకి వృథాగా నీళ్లు పోతున్నాయి అన్నారు సీఎం చంద్రబాబు.. మనకున్న రిజర్వాయిర్‌లో 983 టీఎంసీ కెపాసిటీ ఉంది.. వర్షాలు బాగా పడ్డాయి. సకాలంలో రిజర్వాయర్‌కు మళ్లించగలిగాం.. నదుల అనుసంధానం జరిగితే భవిష్యత్‌లో నీటి సమస్య ఉండదు అన్నారు.. గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ నుంచి బనకచర్ల దగ్గర కలపడం అనేది మా ప్రయత్నంగా తెలిపారు.. వెలిగొండ ఆయకట్టుకు కూడా నీరు ఇచ్చేలా.. ప్రాజెక్ట్ చేయాల్సి ఉందన్నారు.. ఈ బనకచర్ల ప్రాజెక్ట్.. వల్ల రాష్ట్రం మొత్తం అనుసంధానం అవుతుందన్నారు. తెలుగుతల్లికి జలహారతి పేరుతో ఈ బనకచర్ల ప్రాజెక్ట్ ఉండబోతోందన్నారు. ఇక, గోదావరి నది నుంచి కృష్ణా నదికి.. తర్వాత నాగార్జున సాగర్ మీదుగా బనకచర్ల ప్రాజెక్ట్ నీళ్లు చేరతాయని.. బనకచర్ల రాయలసీమకు గేట్ వే అవుతుందని.. రాయలసీమలో ప్రతి ప్రాంతానికి నీరు వెళ్లే పరిస్థితి ఉంటుంది. 80 వేల కోట్లతో మొత్తం ప్రాజెక్ట్ ఉంటుందని వెల్లడించారు సీఎం..
తూర్పు గోదావరిలో రేవ్ పార్టీ కలకలం.. ఐదుగురు యువతుల సహా 19 మంది అరెస్ట్
న్యూఇయర్ సమీపిస్తున్న సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం సృష్టించింది.. కోరుకొండ మండలం బూరుపూడి గేటు దగ్గర ఉన్న నాగ సాయి ఫంక్షన్ హాల్‌లో రేవ్ పార్టీ నిర్వహించారు.. జిల్లా ఎస్పీకి వచ్చిన చమచారంతో పోలీసు ప్రత్యేక బృందాలు నాగసాయి పంక్షన్ హాల్‌లో తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. గుజరాత్ మైక్రో న్యూట్రియన్స్ ఫెస్టిలైజర్ కంపెనీకి చెందిన సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఈ పార్టీ ఏర్పాటు చేసికున్నట్టు విచారణలో తేలిందంటున్నారు పోలీసులు.. అయితే, మొత్తంగా 19 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.. వీరిలో ఐదుగురు మహిళలతోపాటు మరో 14 మంది పురుషులు ఉన్నారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని మహిళలను వైద్య పరీక్షల నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. మహిళలు రాజమండ్రి, కాకినాడ, రంపచోడవరం పరిసర ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు.. ఇక, పట్టుబడిన పురుషులు గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, ఏలూరు, పాలకొల్లు, రాజమండ్రికి చెందిన వారిగా చెబుతున్నారు.. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని.. ఇదే సమయంలో రేవ్ పార్టీ నిర్వహణకు అనుమతించిన ఫంక్షన్ హాల్ యజమానిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.. కోరుకొండ సీఐ సత్య కిషోర్..
సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. మరిన్ని పెట్టుబడుల కోసం చర్చ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంటికి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి కూడా ఉన్నారు. అనంతరం.. సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. మైక్రోసాఫ్ట్ విస్తరణ అవకాశాలపై చర్చిస్తున్నారు. తమ వ్యాపారాన్ని విస్తరించాలని మైక్రోసాఫ్ట్ కంపెనీ చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా నందిగామ ప్రాంతంలో 25 ఎకరాల భూమిని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. స్టాంప్ డ్యూటీ చెల్లించిన తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దీనికి సంబంధించిన లావాదేవీలు జరిగాయి. హైదరాబాద్‌లో డేటా సెంటర్ వ్యాపారాన్ని విస్తరించాలని చాన్నాళ్ల కిందట మైక్రో సాప్ట్ ప్లాన్ చేసింది. ప్రస్తుతం మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మారిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో ఆయన భేటీ కావడం ఇదే తొలిసారి. కాగా.. ఈ సమావేశాన్ని గేమ్ ఛేంజర్‌గా భావిస్తోంది ఐటీ ఇండస్ట్రీ. తెలంగాణంలో మొత్తం 6 డేటా కేంద్రాలను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయనుంది. ఈ డేటా సెంటర్లకు 32 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. రంగారెడ్డి జిల్లాలో మూడు చోట్ల మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఒక్కో డేటా కేంద్రం 100 మెగావాట్ల ఐటీ లోడ్ కలిగి ఉంటుంది.
వచ్చే ఏడాదిలో హరీష్, కేటీఆర్‌లకు సినిమా చూపిస్తాం..
బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్.. తెలంగాణ ప్రజలు ఏం అనుకుంటారో అనే సోయి లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణను ఏటీఎం లాగ వాడుకుని లూటీ చేసి.. ఇప్పుడు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరంలోనైనా.. కేటీఆర్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి కోరుతున్నట్లు తెలిపారు. మరోవైపు.. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు వస్తారు అనుకున్నా.. మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో కేసీఆర్ మంత్రిగా పని చేశారు.. కనీసం అందుకైన సభకు వచ్చి సంతాపం చెప్తారు అనుకున్నా.. కానీ రాలేదన్నారు. వచ్చే ఏడాదిలో హరీష్ రావు, కేటీఆర్‌లకు సినిమా చూపిస్తామని బీర్ల ఐలయ్య హెచ్చరించారు. సంక్రాంతికి రైతులకు రైతు భరోసా ఇస్తామని.. నిజమైన రైతులకు రైతు భరోసా ఇస్తామని తెలిపారు. మరోవైపు.. బీఆర్ఎస్ బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. 2018లో ఉన్న రిజర్వేషన్ తగ్గించింది బీఆర్ఎస్ అని తెలిపారు. కేటీఆర్ జైలుకు పోవడం ఖాయం.. ఇప్పటికే కవిత బెయిల్ మీద ఉంది.. కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉన్నాడు.. హరీష్ కొత్త దారులు వెతుక్కుంటున్నారని బీర్ల ఐలయ్య తెలిపారు.
ట్రై యాంగిల్ సూసైడ్ కేసులో ఎలాంటి ఐ విట్నెస్లు లేవు..
కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన భిక్కనూరు ఎస్‌ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతి ఘటన ఎట్టకేలకు మిస్టరీ వీడింది. ఈ ట్రై యాంగిల్ సూసైడ్ కేసు గురించి ఎస్పీ సింధు శర్మ మీడియాకు వివరాలు తెలిపారు. ముగ్గురు ఆత్మహత్య కేసులో ఎలాంటి ఐ విట్నెస్లు లేవని అన్నారు. ముందుగా ఒకరు చెరువులో దూకితే కాపాడేందుకు మిగతా ఇద్దరు దిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. నిఖిల్‌కు ప్రాణహాని ఉన్నట్లు గతంలో ఫిర్యాదు చేసిన విషయం తనకు తెలియదని ఎస్పీ తెలిపారు. ఆ విషయంలో ఎంక్వైరీ చేస్తున్నాం.. పోస్టుమార్టం ప్రైమరీ రిపోర్ట్ వచ్చిందని ఎస్పీ సింధు శర్మ పేర్కొన్నారు. అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఆత్మహత్యలకు గల కారణాలను విచారణ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యులు లేరు.. అవి ఆత్మహత్యలా, ప్రమాదకరంగా జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నామన్నారు. మొబైల్ ఫోన్ సంభాషణల ఆధారంగా ఆ ముగ్గురు చెరువు దగ్గరకు వెళ్లినట్టు తెలుస్తుంది.. ఆత్మహత్యలకు సంబంధించి మొబైల్ ఫోన్లు, నీటి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడం జరిగిందని ఎస్పీ సింధు శర్మ చెప్పారు.
ఇదంతా గవర్నమెంట్ ప్లాన్.. అల్లు అర్జున్ అంశంపై కేటీఆర్ రియాక్షన్
అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రజా సమస్యలపై నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ అంశాన్ని ప్రభుత్వం తెర పైకి తెచ్చిందన్నారు. అందుకే రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళ పై మాట్లాడారని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన మరణాలపైన రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన గురుకుల పాఠశాల విద్యార్థులకు.. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వీళ్లందరివి కుటుంబాలు కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. సినిమా వాళ్లపైన పడి అటెన్షన్ డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి పాకులాడారని ఆరోపించారు. సినిమా వాళ్ళ నుంచి సెటిల్‌మెంట్ చేసుకొని ఇప్పుడు సైలెన్స్ గా ఉన్నారని ఆరోపించారు. సినిమా వాళ్ళ తోపాటు ఆత్మహత్యలు చేసుకున్న గురుకుల విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, రైతన్నలు, నేతన్నల మరణాల పైన స్పందించాలని డిమాండ్ చేశారు. వీళ్లకి కూడా కనీసం రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ఇదిలా ఉండగా.. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో ఈ నెల 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం అల్లు అర్జున్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా దీనిపై విచారించిన హైకోర్టు ఈ నెల 30 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని అన్నారు. ఆయనను కలిసే అవకాశం తనకు దక్కిందని తెలిపారు. మన్మోహన్ సింగ్ చేసిన సేవలు ఎవరు మరిచి పోరు.. కాంగ్రెస్ రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం దురదృష్టకరం, సంస్కార హీనమని విమర్శించారు. వాజ్ పెయి అంత్యక్రియలు ఎలా జరిగాయో.. అలానే మన్మోహన్ సింగ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.. ఆ బాధ్యతలను అమిత్ షా కి అప్పగించారని తెలిపారు. అంతేకాకుండా.. స్మారక కేంద్రం ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకుందని అన్నారు. రాహుల్ గాంధీ ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని అనుకోవడం.. బోర్ల పడడం పరిపాటి అయిందని కిషన్ రెడ్డి విమర్శించారు. నెహ్రూ కుటుంబం మొదటి నుండి.. ఆ కుటుంబానికి చెందని వారు ప్రధాని అయినా, రాష్ట్రపతి అయిన అవమానించిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు మొసలి కన్నీరు కారుస్తుందని ఆరోపించారు. మన్మోహన్ సింగ్‌ను ఎన్ని సార్లు అవమానించి అగౌరవ పరిచారోనని పేర్కొన్నారు. ఆర్డినెన్సును చింపిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు దొంగ ప్రేమను ఒలక బోస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ అహంకారపూరిత దివాలాకోరు తనాన్ని దేశ మేధావులు ఖండిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. మన్మోహన్ సింగ్ గౌరవార్థం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ వ్యతిరేకించారని తెలిపారు. 2జి కుంభకోణానికి కారణం మన్మోహన్ సింగ్ ఆలోచనలకి విరుద్ధంగా సోనియా వ్యవహరించడమేనని పేర్కొన్నారు. తమ కనుసన్నల్లో పని చేయాలని భావనతో సోనియా, రాహుల్ ఉండే వారని.. బలవంతంగా సంతకాలు పెట్టించారని కిషన్ రెడ్డి తెలిపారు. సోనియా, రాహుల్‌లు షాడో పీఎంలుగా వ్యవహరించారని అన్నారు.
ఎన్నికల ముందు మరో వరాల జల్లు.. అర్చకులకు నెలకు రూ.18 వేల వేతనం
దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అధికార పార్టీ ఆప్ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. అంతేకాకుండా ఆయా వర్గాలపై ఎన్నికల వరాల జల్లులు కూడా కురిపిస్తున్నారు. ఇప్పటికే మహిళలకు నెలకు రూ.2,100 సాయం చేస్తామని ప్రకటించారు. అలాగే 60 ఏళ్లు దాటిన వృద్ధులకు అన్ని రకాల ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని వెల్లడించారు. తాజాగా అర్చకులపై కూడా వరాల జల్లు కురిపించారు. సోమవారం పూజారి గ్రంథి సమ్మాన్ యోజన పథకాన్ని మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రకటించారు. నెలకు రూ.18,000 ఇస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈ పథకం కింద దేవాలయాల పూజారులు, గురుద్వారాలోని ‘గ్రంథి’లకు నెలకు రూ.18,000 గౌరవ వేతనం అందజేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. వచ్చే ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ‘పూజారీ గ్రంథి సమ్మాన్ యోజన’ను ప్రారంభిస్తామని, దీని కింద ఆలయ పూజారులు, గురుద్వారాలకు నెలవారీగా రూ.18,000 గౌరవ వేతనం అందజేస్తామని అరవింద్ కేజ్రీవాల్ సోమవారం వివరించారు. మంచి, చెడు సమయాల్లో ప్రజల జీవితాల్లో పూజారులు, గ్రంథులు మంచి పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. ఈ స్థాయిలో వేతనం ఇవ్వడం దేశంలోనే ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. అర్చకులు ప్రాచీన ఆచారాలను ముందుకు తీసుకెళ్తున్నారని.. వారు తమ కుటుంబాన్ని కూడా పట్టించుకోరని తెలిపారు.
శోకసంద్రంలో దేశం.. న్యూ ఇయర్ వేడుకల కోసం వియత్నాంకు రాహుల్ గాంధీ
మన్మోహన్ సింగ్ మరణానంతరం పలు అంశాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై బీజేపీ విరుచుకుపడింది. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఒకవైపు దేశం మొత్తం సంతాపం వ్యక్తం చేస్తోందని బీజేపీ పేర్కొంది. మరోవైపు రాహుల్ గాంధీ నూతన సంవత్సర వేడుకల కోసం వియత్నాం వెళ్లారని ఆరోపించింది. మన్మోహన్ సింగ్ చితాభస్మ నిమజ్జనానికి కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి చెందిన వారు ఎవరూ హాజరు కాలేదని బీజేపీ విమర్శించింది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా రాహుల్ గాంధీని విమర్శిస్తూ.. ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. “మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. మరోవైపు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వియత్నాం వెళ్లారు. మాజీ ప్రధాని మరణంపై రాహుల్ గాంధీ రాజకీయాలు చేస్తున్నారు. పార్టీ ప్రయోజనాల కోసం ఆయన మరణాన్ని కూడా ఉపయోగించుకున్నారు. గాంధీ కుటుంబం, కాంగ్రెస్ సిక్కులను ద్వేషిస్తున్నాయి. ఇందిరా గాంధీ దర్బార్ సాహిబ్‌ను అవమానించిన తీరును మర్చిపోవద్దు” అని రాసుకొచ్చారు.
హరీష్ శంకర్ కి కొత్త టెన్షన్?
2024 లో తెలుగులోనే కాదు బాలీవుడ్ సహా అన్ని భాషలలో పలు సినిమాలు భారీ డిజాస్టర్ గా నిలిచాయి. అనౌన్స్ చేసినప్పుడు భారీ అంచనాలతో ప్రేక్షకులను ఆకర్షించిన ఈ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మాత్రం దారుణమైన ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ లో తెరకెక్కిన బేబీ జాన్ కూడా అలాంటిదే. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో రూపొందించబడిన ఈ సినిమా తమిళంలో గతంలో తెరకెక్కిన తేరి అనే సినిమాకి బాలీవుడ్ రీమేక్. ఈ సినిమాని బాలీవుడ్ జనం ఒక రేంజ్ లో పక్కన పెట్టారు. దీంతో 2024 లోని భారీ డిజాస్టర్ల లిస్టులో ఈ సినిమా కూడా స్థానం దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఇదే విషయం హరీష్ శంకర్ మీద ప్రెజర్ పెంచుతుంది. ఎందుకంటే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా తేరి రీమేక్. అయితే హరీష్ శంకర్ కి రీమేక్ సినిమాలను పూర్తిగా మార్చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీస్తాడు అనే పేరు ఉంది. అయితే ఆయన అలాగే చేసిన చివరి సినిమా మిస్టర్ బచ్చన్ మాత్రం దారుణమైన పరాజయం అందుకుంది. సినిమా పరంగా పర్వాలేదు అనిపించుకున్నా ఎందుకో సినిమా రిసల్ట్ మాత్రం భారీగా దెబ్బేసింది. దీంతో ఇప్పుడు హరీష్ శంకర్ చేయబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆయనకు ఒక విషమ పరీక్ష లాంటిది అని చెప్పొచ్చు. సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో మార్పులు చేర్పులు చేసిన ఆయన పవన్ కళ్యాణ్ కి చెప్పి ఫైనల్ చేయాల్సి ఉంది. అయితే గతంలోనే తేరి సినిమా పోలీసోడు పేరుతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో అలాంటి సినిమా నే మరోసారి తెరకెక్కిస్తే అది ఎంతవరకు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారనేది చూడాల్సి ఉంది.. ఇప్పటికే తెలుగులో ఈ సినిమా అందుబాటులో ఉండడం, అదే సినిమాని హిందీలో రీమేక్ చేస్తే భారీ డిజాస్టర్ కావడంతో ఒక రకంగా ఇది హరీష్ శంకర్ కి కీలకమైన పరీక్ష. మరి ఆయన ఈ పరీక్ష ఎలా పాస్ అవుతారో చూడాలి.
మెగాభిమానులకు దిల్ మామ మార్క్ ‘హై’
రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏ సినిమా తెరకెక్కింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా మీద హైట్ అంతకంతకు పెరుగుతూ వెళ్ళింది. ఇక తాజాగా విజయవాడలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ కటౌట్ ఒకదాన్ని లాంచ్ చేశారు. ఆ లాంచ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ నుంచి దిల్ రాజు విజయవాడ వెళ్లారు. ఆ కటౌట్ లంచ్ తర్వాత హెలికాప్టర్ ద్వారా పూలాభిషేకం జరిపించి ఆ తర్వాత దిల్ రాజు అక్కడే అభిమానులతో ముచ్చటించారు. అయితే ఈ ముచ్చటిస్తున్న క్రమంలోనే మెగా అభిమానుల ఆనందాన్ని మరింత పెంచే విధంగా ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి చూశారని సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని ఈసారి పండుగ మనదేనని అభిమానులకు చెప్పాలని చెప్పినట్లు వెల్లడించారు. ఒక రకంగా ఈసారి సంక్రాంతి మనదే అంటూ మెగాస్టార్ చెప్పినట్లు దిల్ రాజు చెప్పడంతో అభిమానుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గట్టే ఈ సినిమాతో రామ్ చరణ్ తేజ నట విశ్వరూపం కూడా చూస్తారని ఆయన అన్నారు. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా, పోలీస్ అధికారిగా, పొలిటికల్ లీడర్ గా ఇన్ని పార్స్యాలలో తన నటనను చూపిస్తారని ఆయన అన్నారు. అంతే కాదు సినిమా సాంగ్స్ కోసమే 75 కోట్లు ఖర్చయ్యాయని శంకర్ మార్క్ సాంగ్స్ రామ్ చరణ్తో చూస్తారని ఆయన పేర్కొనడంతో ప్రస్తుతానికి మెగా అభిమానులు అందరూ ఒక రకమైన హై ఎంజాయ్ చేస్తున్నారు. మామూలుగానే సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసే దిల్ రాజు రామ్ చరణ్ తేజ నోటా విశ్వరూపం మెగాస్టార్ చిరంజీవి ఈసారి పండుగ మనదే అన్నారని అనడంతో అంచనాలు మరింత పెరిగాయి. మరి చూడాలి ఏం జరగబోతోంది అనేది.
బాలయ్యతో రామ్ చరణ్.. మాములుగా ఉండదు మరి!
ఒకపక్క నందమూరి అభిమానులతో పాటు మరోపక్క మెగా అభిమానులు కూడా సంబరపడే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. వాస్తవానికి ఒకప్పుడు మెగా వెర్సెస్ నందమూరి అన్నట్టుగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఒకపక్క తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయడంతో ఆయా పార్టీల అభిమానులు, మెగా నందమూరి అభిమానులు సైతం కలిసి మెలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే నాలుగో సీజన్ ఎపిసోడ్ కోసం రామ్ చరణ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే రామ్ చరణ్ తేజ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా వచ్చే నెల 10వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతానికి స్టార్ సినిమాలు ఏవైనా సరే ప్రమోషన్ కోసం బాలకృష్ణ షోకి వెళుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ కూడా తన సినిమా ప్రమోషన్ కోసం వెళ్లబోతున్నట్లుగా ముందు ప్రచారం జరిగింది. అదే విషయాన్ని ఆహా వీడియో సంస్థ అధికారిక ప్రకటన చేసేసింది. ఒరేయ్ చిట్టిబాబు వస్తున్నాడు రీసౌండ్ ఇండియా అంతా వినపడేలా చేయండి అంటూ ఆహా ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్ట్ వచ్చింది. దీంతో నందమూరి బాలకృష్ణ షో కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ రాబోతున్నాడు అంటూ మెగా అభిమానులు ఇప్పటికే ఒక రేంజ్ లో ఎగ్జైట్మెంట్ వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా నందమూరి బాలకృష్ణ షోకి వచ్చిన వారందరితో బాగా క్లోజ్ అవుతూ వారి పర్సనల్ విషయాలను ఎవరికీ తెలియని విషయాలను ప్రేక్షకులకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మెగా పవర్ స్టార్ నుంచి ఎలాంటి విషయాలు రాబడతారో చూడాల్సి ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ షోకి సినిమా టీం లోని కొందరితో పాటు రామ్ చరణ్ తేజ్ భార్య ఉపాసన సైతం హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది..