Political Flower Bouquets: ప్రపంచం మొత్తం 2024 ఏడాదికి బైబై చెప్పి.. 2025కి వెల్‌కం చెప్పేందుకు రెడీ అవుతుంది.. ఈ సమయంలో టెంపుల్ సిటీలో హాట్ టాపిక్‌గా మారిపోయాయి పొలిటికల్ బొకేలు.. నూతన సంవత్సరం సందర్భంగా ఆయా నేతలకు ఇవ్వడానికి తిరుపతిలోని బొకేల షాపులు ఏర్పాటు చేసిన బొకేలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.. ఆయా పార్టీలకు సంబంధించిన రంగులన్న పూలతో తయారు చేసినా బొకేల్లో.. ఆ పార్టీలకు చెందిన నేతల ఫొటోలను కూడా పొందుపరిచారు.. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి బీజేపీ, జనసేన, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ బొకేలు.. అందులోనూ ఎక్కువగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలు ఉన్న బొకేలు ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతున్నట్టుగా చెబుతున్నారు నిర్వాహకలుఉ.. అయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల బొకేలను కూడా పెద్ద ఎత్తున కోనుగోలు చేస్తున్నారట కార్యకర్తలు..
Read Also: Manchu Vishnu : అడవి పందులను వేటాడిన వివాదంలో మంచు విష్ణు సిబ్బంది
మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో నూతన సంవత్సరానికి ముందు పువ్వులు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి.. రాజకీయ నాయకుల చిత్రాలు మరియు పార్టీ చిహ్నాలతో రూపొందించిన పుష్పగుచ్ఛాలు నూతన సంవత్సర వేడుకలకు ముందు టెంపుల్ సిటీలోని ఫ్లోరిస్ట్ బోటిక్‌లలోకి ప్రవేశించాయి.. పూల బుట్టలు మరియు బొకేలు వాటిలో రాజకీయ చిహ్నాలు.. వారి అభిమాన నాయకుల చిత్రాలను చేర్చడం ఆకర్షణగా మారిపోయింది.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వస్తున్న తొలి కొత్త సంవత్సరం కావడంతో.. ఓ పూల వ్యాపారి ఒక ప్రత్యేకమైన ఆలోచనతో వీటిని ముందుకు తీసుకొచ్చారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్.. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఫొటోలతో పాటు వారి పార్టీ చిహ్నాలు కమలం, సైకిల్, టీ గాజు, హస్తం గుర్తులు ఉన్నాయి.