* నేటి నుంచి ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్.. ఒకే టోర్నీలో రెండో టైటిల్‌పై గురి పెట్టిన తెలుగు తేజం కోనేరు హంపి.. పోటీలో పాల్గొననున్న మరో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారికలో పాటు భారత క్రీడాకారులు దివ్య దేశ్‌ముఖ్, వైశాలి.. ఓపెన్ విభాగంలో తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేశి, ప్రజ్ఞానానంద
* ఏపీలో ఇవాళ ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ.. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం.. పల్నాడు జిల్లాలో పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.
* హైదరాబాద్: నేడు ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసుపై హైకోర్టులో విచారణ.. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను విచారించనున్న తెలంగాణ హైకోర్టు.. రాజకీయ కక్షతో ఈ కేసులో తనను ఇరికించారని కేటీఆర్ కౌంటర్.. అరెస్ట్ చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలన్న ఏసీబీ.. నేటితో ముగియనున్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల గడువు
* నేటితో ముగియనున్న ఏపీ సీఎస్ నీరబ్‌కుమార్ పదవీకాలం.. ఏపీ కొత్త సీఎస్‌గా విజయానంద్.. ఏపీ సీఎస్‌గా ఈ రోజు సాయంత్రం బాధ్యతలు తీసుకోనున్న విజయానంద్
* న్యూఇయర్ సందర్భంగా నేడు, రేపు మద్ంయ అమ్మ కాల సమయం పెంపు.. రాత్రి 1 గంట వరకు సమయం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నేటి నుంచి భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు.. నేడు మత్స్యవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న స్వామి వారు.. వచ్చే నెల 9న గోదావరిలో స్వామి తెప్పోత్సవం, 10 ఉత్తర ద్వార దర్శనం..
* భద్రాద్రి: నేడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, డీజేలు వాడితే చర్యలు.. మైనర్ లు వాహనాలు నడిపితే ఇచ్చిన వారిపై కేసుల నమోదు-ఎస్పీ రోహిత్ రాజు
* ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత.. సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.. మెదక్ జిల్లా టేక్మాల్ 15.1, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్ లో 15.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
* అమరావతి : ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లు పంపిణీ . 65 లక్షల మందికి ఇవాళ ఉదయం నుంచి పెన్షన్ పంపిణీ. కొత్త సంవత్సరం రానుండడంతో ఒకరోజు ముందుగా ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ పంపిణీ….
* ప్రకాశం : పొన్నలూరు మండలం సుంకిరెడ్డిపాలెంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి..
* మంత్రి గొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా నరసరావుపేట లో సీఎం చంద్రబాబుతో కలిసి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు..
* ఒంగోలులో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి..
* శ్రీకాకుళం: రణస్థలం మండలం, రావాడ గ్రామంలో, NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే ఈశ్వరరావు .. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలి శెట్టి అప్పలనాయుడు .
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర పురపాలక.. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
* రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో పాల్గొంటారు
* అన్నమయ్య జిల్లా : నేడు చిన్నమండెం, సంబేపల్లి, రాయచోటి మండలాలలో పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొననున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి…
* అన్నమయ్య జిల్లా : ఈ నెల 27న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబు పై జరిగిన దాడి ఘటన కేసులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం… 9 మంది వైసిపి నాయకులను అరెస్టు చేసిన పోలీసులు… నేడు లక్కిరెడ్డిపల్లి కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు…
* నేడు పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. నరసరావుపేట మండలం యల్లమందలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొననున్న సీఎం.. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ల పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు. శారమ్మ అనే మహిళకు వితంతు పెన్షన్, ఏడుకొండలు అనే వృద్దుడికి వృద్ధాప్య పెన్షన్ స్వయంగా ఇవ్వనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు గొట్టిపాటి, అనగాని,రామనారాయణరెడ్డి. యల్లమంద గ్రామస్తులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి
* కోటప్పకొండ త్రికోటేస్వరుణ్ణి దర్శించుకొనున్న విషయం చంద్రబాబు, పలువురు మంత్రులు. సీఎం పర్యటన నేపథ్యంలో యల్లమంద చుట్టుపక్కల మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు.
*అనంతపురం : తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం.
* అనంతపురం : వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్ద తాండా గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి పయ్యావుల కేశవ్
* తూర్పుగోదావరి జిల్లా: ఉండ్రాజవరం మండలం, పసలపూడి గ్రామంలో “ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ” కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్.. అనంతరం నిడదవోలు, రాజమండ్రి నియోజకవర్గాల్లో పలు ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు
* అంబేద్కర్ కోనసీమజిల్లా : నేటి రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 121 పోలీస్ పికెట్లు , 40 మొబైల్ పోలీస్ పార్టీలతో గస్తీ : ఎస్పీ బి. కృష్ణారావు
* విశాఖ: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఎక్సైజ్ శాఖ నిఘా.. రేవ్ పార్టీలు, ఔట్ డోర్ ఈవెంట్స్ కట్టడికి స్ట్రైకింగ్ టీమ్ లు… డ్యూటీ పెయిడ్ లిక్కర్ మాత్రమే అనుమతి.. ఇవాళ, రేవు అర్ధరాత్రి వరకు తెరిచి వుండనున్న మద్యం షాపులు.. ఈ ఒక్కరోజే 15 కోట్లు సెల్స్ అంచనాలు. ప్రీమియం బ్రాండ్ లిక్కర్ కు పెరిగిన డిమాండ్ …..
* పశ్చిమ గోదావరి: నేడు. నర్సాపురం మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం..