అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో పర్యాటకుల సందడి నెలకొంది. సెలవు రోజులు కావడంతో పర్యాటకులు కుటుంబ సమేతంగా విచ్చేసి ఆనందంగా గడుపుతున్నారు. దానికి తోడు శీతాకాలంలో ప్రకృతి అందంగా కనిపిస్తుంది. మారేడుమిల్లి ప్రాంతంలో పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. దట్టమైన కొండల మధ్యలో చావడికోట వ్యూ పాయింట్‌కి పర్యటకులు ఎగబడుతున్నారు.
చైనాలో గుర్తించిన మరో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటా న్యూమో వైరస్) కి సంబంధించిన కేసులు రాష్ట్రంలో ఎక్కడా లేవని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా. పద్మావతి తెలిపారు. ఈ వైరస్ కారణంగా ప్రజలెవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
శ్రీశైలంలో రద్దీ రోజులలో మల్లన్న స్పర్శదర్శనంలో మార్పులు చేస్తూ నిర్ణయించింది.. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ స్పర్శదర్శనంలో మార్పులు చేసింది దేవస్థానం.. ఇక, మీదట ప్రతి శనివారం, ఆదివారం, సోమవారం ప్రభుత్వ సెలవు రోజుల్లో రోజుకు 2 విడతలుగా మాత్రమే స్పర్శ దర్శనం కల్పించనున్నారు.. రద్దీ రోజుల్లో ప్రతి విడతకు 500 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచనుంది దేవస్థానం.. ఈ సమయంలో ఉదయం 7:30 గంటలకు.. తిరిగి రాత్రి 9 గంటలకు మాత్రమే శ్రీస్వామివారి స్పర్శ దర్శనం కల్పించనున్నారు..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో ఓ పాము హల్చల్ చేసింది.. అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయంలో పాము కనిపించడంతో ఉద్యోగులు, సిబ్బంది హడలిపోయారు.. అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యే గోదావరి భవన్‌లోకి భారీ పాము చేరడంతో ఉద్యోగులను హడలెత్తించింది.
ముంబై తరహాలో ఏపీకి విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా మారుతుందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేవీ డే సందర్భంగా వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో భారత నౌకాదళ విన్యాసాలను తిలకించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ రక్షణ, విపత్తుల నిర్వహణలో తూర్పు నావికాదళం సేవలు అద్భుతమైనవి అన్నారు.. ఈస్ట్ కోస్ట్ లో ఎకనామిక్ యాక్టివిటీ పరిరక్షణ బాధ్యత నేవీ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు..
నేవీ డే సందర్భంగా వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో భారత నౌకాదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. విశాఖలో నేవీ వేడుకలు అబ్బురపరిచాయి.. నేవీదళ విన్యాసానాలతో ఆర్కే బీచ్ యుద్ధ భూమిని తలపించింది.. శక్తి యుక్తులు ప్రదర్శించాయి అత్యాధునిక యుద్ధ విమానాలు, నౌకలు.. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఎయిర్ షో నిలిచింది..
పోలవరం ఏ ఒక్క ప్రాంతానికో వరం కాదు.. రాష్ట్ర రైతాంగానికి ఇదో గొప్ప వరం అన్నారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. కన్న తల్లికి దణ్ణం పెట్టలేని జగన్.. తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని దుయ్యబట్టిన ఆయన.. 9 వేల మంది పోలవరం నిర్వాసితులకు దాదాపు వెయ్యి కోట్లు.. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా, సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో విడుదల చేశాం అన్నారు.
బాపట్ల జిల్లా రేపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు రెవెన్యూ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకూ నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందించనున్నామని వెల్లడించారు..
ఎంతో మందికి అన్నం పెట్టిన మహాతల్లి డొక్కా సీతమ్మ.. ఆ పేరుతో జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి.. నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పది మందికి అన్నం పెట్టిన మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరుతో కూటమి ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించిందన్నారు..