ఏపీ ప్రభుత్వం ఆర్ధిక శాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా ఉన్న బకాయిలు బిల్లులు రూ.6,700 కోట్లకు పైగా ఉన్న వాటిని చెల్లించడానికి ఆదేశాలు ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఆర్ధిక శాఖపై ప్రత్యేక సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల జీపీఎఫ్, విద్యార్థుల ఫీజు రీఎంబర్స్‌మెంట్, పోలీసుల సరెండర్ లీవ్‌ల చెల్లింపులు, కాంట్రాక్టర్లు, విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. మంత్రి లోకేష్ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ చేయాలని రోజు ఒత్తిడి చేస్తున్నారని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు.
Venkatesh: సింగర్ మధుప్రియతో స్టెప్పులు వేసిన వెంకీ మామ
రాష్ట్రంలో 10 లక్షల కోట్లు అప్పు ఉంది.. లక్షా 20 వేల కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి.. ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీఎం చంద్రబాబు చెపుతున్నారన్నారు. తల్లికి వందనం, రైతుకు అన్నదాత సుఖీభవతో పాటు అన్ని హామీలు అమలు చేయాలని తెలిపారన్నారు. రూ.6700 కోట్లు నిధులు విడుదల చేశాం.. పోలీసులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెండింగ్ నిధులు, జీపీఎఫ్ రూ.519 కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. పోలీస్ సరెండర్ లీవ్స్ చెల్లింపులు రూ.213 కోట్లు, సీపీఎస్ రూ. 300 కోట్ల నిధులు, టీడీఎస్ రూ. 265 కోట్లు, ఉద్యోగులకు రూ. 1300 కోట్లు నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.788 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించామన్నారు.
Delhi Assembly Elections: బీజేపీ రెండో జాబితా విడుదల.. ఎవరెవరికి చోటు దక్కిందంటే?
26 వేల మందికి 10 లక్షల లోపు బిల్లులు చెల్లించనున్నాం.. అందుకోసం రూ. 586 కోట్లు నిధులు విడుదల చేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. రూ.90 కోట్లు 650 చిన్న కంపెనీలకు విడుదల.. విద్యుత్ సబ్సిడీకి రూ.500 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవ రూ.400 కోట్లు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పయ్యావుల పేర్కొన్నారు. అలాగే.. అమరావతి రైతుల కౌలు బకాయి రూ.241 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. ప్రతి రోజూ పండగ లాగా ప్రజల జీవనం సాగాలి.. ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా ముందుకు సాగుతున్నామని అన్నారు. మరోవైపు..
ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం బాసటగా నిలుస్తుంది.. ప్రతి రంగాన్ని రివైవ్ చేస్తున్నాం.. ప్రభుత్వం అప్పులు తెచ్చి ప్రజల కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. విద్యుత్ ఛార్జీలు తమ ప్రభుత్వంలో పెరగవని మంత్రి చెప్పారు. లోకేష్ గుడ్ మార్నింగ్ కి బదులు విద్యార్థుల ఫీజు రీయంబర్స్ విడుదల చేయండి అని తనకు మెసేజ్ లు చేస్తున్నారని మంత్రి పయ్యావుల తెలిపారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని పేర్కొన్నారు.