BCCI: ఇక వారికే వదిలేస్తున్నాం.. భారత్-పాక్ వివాదంపై బీసీసీఐ సంచలన ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan controversy: టీ 20 వరల్డ్ కప్‌కు ముందు పాకిస్థాన్ మూర్ఖ వైఖరి గురించి అందరికీ తెలిసిందే. భద్రతా అంశాన్ని తెరపైకి తెచ్చిన పాక్.. భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు నో చెప్పింది. టీ20 వరల్డ్ కప్‌కు ముందు భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌పై మరోసారి చర్చలు తెరపైకి వచ్చాయి. ఇటీవల పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. భారత్‌తో జరిగే మ్యాచ్‌లను పాకిస్థాన్ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై తాజాగా భారత క్రికెట్ బోర్డు(BCCI) స్పందించింది. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఈ విషయంలో బోర్డు వైఖరి చాలా క్లియర్‌గా ఉందని స్పష్టం చేశారు. తాజాగా ANIతో మాట్లాడిన ఆయన.. “పాకిస్థాన్ ప్రధాని వ్యాఖ్యలపై బీసీసీఐకి చెప్పాల్సిందేమీ లేదు. ఈ నిర్ణయం పూర్తిగా ఐసీసీ పరిధిలో ఉంటుంది. ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటే, మేం అదే పాటిస్తాం,” అని తెలిపారు. అంటే ఈ వివాదంలో భారత్ తుది తీర్పును ఐసీసీకే వదిలేసింది.
Also Read
- Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
- Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్‌పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
- Vijay TVK Alliance: విజయ్ కూటమిలోకి ఎవరు..? మిత్రపక్షాల భేటీపై తమిళనాడులో పెరిగిన ఆసక్తి
- IND vs AFG T20: వైభవ్‌తో ఓపెనింగ్ జోడీ ఎవరు..?.. టీమ్ ఇండియా ప్రయోగంపై ఉత్కంఠ
ఇదిలా ఉండగా.. బుధవారం ఇస్లామాబాద్‌లో జరిగిన ఫెడరల్ క్యాబినెట్ సమావేశంలో షెహబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తారు. శ్రీలంకలో ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్–పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ను తమ జట్టు ఆడబోదని మరోసారి ప్రకటించారు. “ఈ విషయంలో మేం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాం. భారత్‌తో మ్యాచ్ ఆడబోం. ఈ నిర్ణయం తొందరపాటులో తీసుకున్నది కాదు. బాగా ఆలోచించి, అన్ని కోణాలు చూసిన తర్వాతే ఈ స్టాండ్ తీసుకున్నాం” అని తెలిపారు. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదని చెబుతూనే, భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించడమే సరైన నిర్ణయమని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. ఇది తొలిసారి చేసిన ప్రకటన కాదు. దీనికంటే ముందే పాకిస్థాన్ ప్రభుత్వం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఓ ప్రకటన చేసింది. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఆడబోదని స్పష్టం చేసింది. అయితే ఇందుకు సరైన కారణం మాత్రం వెల్లడించలేదు. ఆ తర్వాతే ఈ వ్యవహారం అంతర్జాతీయంగా పెద్ద చర్చగా మారింది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం భారత్–పాకిస్థాన్ మ్యాచ్ చుట్టూ మళ్లీ అనిశ్చితి నెలకొంది. ఒకవైపు పాకిస్థాన్ ప్రభుత్వం కఠినంగా నిలబడుతుంటే, మరోవైపు బీసీసీఐ నిర్ణయాన్ని ఐసీసీ చేతుల్లో పెట్టింది. ఇప్పుడు ఏం జరగనుందో ఐసీసీ నిర్ణయించాలి.
తాజావార్తలు
-
Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
-
Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
-
Trump: ట్రంప్ దేనికో భయపడుతున్నాడు? 50 మంది సైనిక అధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు!
-
Ampere Magnus G Max: ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్.. 142KM రేంజ్.. 65KM స్పీడ్.. 34 లీటర్ల స్టోరేజ్!
-
Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్‌పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!