JanaSena Party: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అంశం తీవ్ర వివాదంగా మారింది.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి ఇది పెను ముప్పుగా మారే అవకాశం ఉందనే విశ్లేషణలు కూడా వినిపించాయి.. ఈ వ్యవహారంలో ముందుగానే అలర్ట్ అయిన టీడీపీ అధిష్టానం.. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ.. ఎలాంటి కామెంట్లు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.. దీంతో.. టీడీపీ-జనసేన పోటీ పోటీ.. సోషల్ మీడియా పోస్టులకు కాస్త బ్రేక్ పడినట్టు అనిపించింది.. మరోవైపు.. జనసేన అధిష్టానం కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఉప ముఖ్యమంత్రి అంశంపై ఎవరూ మాట్లాడొద్దని స్పష్టం చేసింది.. డిప్యూటీ సీఎం విషయంలో మీడియా ముందు గానీ, సోషల్ మీడియాలో గానీ.. ఎవరూ స్పందించవద్దని మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది..
Read Also: Adi Srinivas: నీ వల్ల సిరిసిల్లలో ఒక్క కార్మికుడి జీవితం కూడా మారలేదు.. కేటీఆర్ పై ఫైర్
ఈ ఆదేశాలను జనసేనా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ వాట్సాప్ స్టేట్‌గా పెట్టారు.. ఆ తర్వాత జనసేన గ్రూపుల్లో పార్టీ అధిష్టానం ఆదేశాలు వైరల్‌గా మారిపోయాయి.. అయితే, డిప్యూటీ సీఎం పదవిపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ శ్రేణులకు టీడీపీ ఆదేశాలు ఇచ్చిన ఒక రోజు తర్వాత స్పందించింది జనసేన.. డిప్యూటీ సీఎం అంశంపై జనసేన నుంచి కూడా పలువురు స్పందిస్తుండడంతో.. నిన్న లోకేష్ డిప్యూటీ అంశం ఎవ్వరూ మాట్లాడవద్దని టీడీపీ ఆదేశాలు జారీ చేసింది.. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంశం మాట్లాడినా స్పందించవద్దు అని జనసేన ఆదేశించింది.. సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ వ్యవహారంపై పోస్టులు పెడుతున్నారు.. అయితే, జనసేన ఆదేశాలతో ఇక డిప్యూటీ సీఎం అంశానికి ఫుల్ స్టాప్ పడుతుందా అనే చర్చ కూడా సాగుతోంది..
Read Also: Grama Sabalu : గ్రామ సభల్లో లొల్లి లొల్లి.. అధికారులను నిలదీస్తున్న గ్రామస్తులు
కాగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో.. సీఎం పాల్గొన్న సభ వేదిక నుంచే కడప జిల్లా టీడీపీ అధ్యక్షునిగా ఉన్న శ్రీనివాసరెడ్డి.. మంత్రి నారా లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలనే తన అభిప్రాయాన్ని వెల్లడించారు.. ఇక, ఆ తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రి సోమిరెడ్డి.. ఇలా పార్టీలో కీలకంగా ఉన్న పలువురు నేతలు కూడా ఇదే డిమాండ్ తెరపైకి తెచ్చారు.. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హీట్ పెంచింది.. అంతేకాదు.. జనసేన పార్టీ నుంచి కూడా కౌంటర్ ఎటాక్ మొదలైంది.. లోకేష్‌ని డిప్యూటీ సీఎంను చేయండి తప్పులేదు.. కానీ, పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది.. ఇలాంటి చర్చ కూటమిలో కొత్త సమస్యలు తెస్తుందని గ్రహించిన టీడీపీ అధిష్టానం.. ఎవరూ ఈ వ్యవహారంలో ఎలాంటి కామెంట్లు చేయొద్దని ఆదేశాలు ఇవ్వగా.. ఇప్పుడు జనసేన కూడా ఎక్కడా దీనిపై మాట్లాడొద్దని స్పష్టం చేసింది..