రాజధాని నిర్మాణానికి 11 వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు హడ్కో నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.. ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు.. అమరావతి నిర్మాణం కోసం హడ్కో ద్వారా 11 వేల కోట్ల రూపాయల రుణం కోసం సంప్రదింపులు జరిపాం.. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని వెల్లడించారు..
విజయవాడ రైల్వే స్టేషన్ FSSAI నుండి '5 స్టార్ ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికేట్ పొందింది.. విజయవాడ రైల్వే స్టేషన్ అత్యుత్తమ పరిశుభ్రత మరియు సురక్షితమైన ఆహార పద్ధతులను అమలు చేసినందుకు భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) నుండి ప్రతిష్టాత్మకమైన 'ఈట్ రైట్ స్టేషన్' ధృవీకరణను పొందింది.
టెమాసెక్ హోల్డింగ్స్ భారత స్టాటజిక్ ఇనిషియేటివ్ హెడ్ రవి లాంబాతో సమావేశం అయ్యారు ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. శరగవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో టెమాసెక్ గ్రూపు అనుబంధ సంస్థ క్యాపిటా ల్యాండ్ ద్వారా ఇండస్ట్రియల్ పార్కులు, డాటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.. ఏపీ ఇండస్ట్రియల్ క్లస్టర్లలో REIT మోడల్ లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయమన్నారు.. వైజాగ్, తిరుపతి నగరాల్లో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయాలని అడిగారు లోకేష్..
భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచడంపై కసరత్తు ప్రారంభించింది ప్రభుత్వం.. వచ్చే నెల (ఫిబ్రవరి) 1వ తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందట.. అధికారులు, ప్రజాప్రతినిధుల సూచనలతో ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందట.. అయితే, అమరావతి ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే విషయంలో మినహాయింపు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందట..
తొలిసారి డిప్యూటీ సీఎం ప్రచారంపై స్పందించిన నారా లోకేష్.. తాను రాజకీయంగా సెటిల్గా ఉన్నాను.. ఎన్నికల్లో ప్రజలు మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు.. 94 శాతం సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించారని తెలిపారు.. ఇక, నాకు ప్రస్తుతం చేతి నిండా పని ఉంది.. నాపై బాధ్యత కూడా ఉంది అన్నారు.. తనకు అప్పగించిన శాఖలపై పనిచేస్తున్నాను అన్నారు
దావోస్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది.. పోర్టులు, మానవ వనరులకు లోటు లేదు.. పెట్టుబడులతో రండి అంటూ వివిధ సంస్థలను ఆహ్వానించారు సీఎం.. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలలో ఒకటైన డెన్మార్క్కు చెందిన మార్స్క్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది.
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది.. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా మారిపోయింది జనసేన.. అంతే కాదు.. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేసింది ఎన్నికల సంఘం.. జనసేన పార్టీని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది కేంద్ర ఎన్నికల సంఘం
ఈ రోజు పలు జిల్లాల అధ్యక్షులను ప్రకటించింది భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్.. మొత్తంగా 24 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది బీజేపీ..
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో.. ప్రేమ పేరుతో తన కుమార్తెను వేధిస్తున్న బాలుడిపై కత్తితో దాడికి దిగాడు సదరు బాలిక తండ్రి.. ముమ్మిడివరం ప్రభుత్వ బాలుర పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు బాలుడు.. ఎదురుగా ఉన్న బాలికల పాఠశాలలో టెన్త్ చదువుతోంది బాలిక.