NICDC: రాయలసీమలో పరిశ్రమలకు కేంద్రం పెద్దపీట.. ఎన్‌ఐసీడీసీకి రూ.872 కోట్లు విడుదల..
- రాయలసీమలో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం పెద్దపీట..
- ఎన్‌ఐసీడీసీకి రూ.872 కోట్లు విడుదల..
- కడప జిల్లా కొప్పర్తిలోని ఇండస్ట్రియల్ పార్క్.. ఎన్‌ఐసీడీసీకి బదలాయింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NICDC: వెనుకబడిన రాయలసీమలో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్ కు 872.07 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కడప జిల్లా చింతకొమ్మ దిన్నె మండలంలోని కొప్పర్తిలో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ ను నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్ కు బదలాయించనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాక్షర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో నడుస్తున్న కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కును, ఇకనుంచి నేషనల్ ఇండస్ట్రియల్ క్యారిడార్ క్రిందికి వెళ్ళనున్నది. ప్రస్తుతం ఏపీఐసీసీ చేతిలో ఉన్న 2595.40 ఎకరాల భూములను నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ కు బదిలీ చేయనున్నారు. ఏపీఐసీసీ నుంచి ఎన్ఐసిడిఐటికి భూములు బదలాయింపుకు అయ్యే 65.40 కోట్లు రూపాయల స్టాంప్ డ్యూటీని రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.
Read Also: Nalgonda: బీఆర్‌ఎస్ రైతు మహా ధర్నా.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేటీఆర్
Also Read
కొప్పర్తి లోని ఏపీఐసీసీ భూములు బదలాయింపు కోసం స్టాంప్ డ్యూటీ కింద 43.60 కోట్లు, రిజిస్ట్రేషన్ రుసుముల కోసం 8.72 కోట్లు, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ కింద మరో 13.08 కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అవసరమైన ఈ మొత్తం 65.40 కోట్ల రూపాయలను చెల్లించాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇస్తూ, రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్‌పీసీ సిసోడియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. భూముల బద్దలాయింపు కాగానే నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొప్పర్తిలో మౌలిక వసతులకు శ్రీకారం చుట్టునున్నారు. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులను 872.07 కోట్లతో చేపట్టనున్నారు…
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!