దావోస్ పర్యటలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ బిజీబిజీగా గడుపుతున్నారు.. ఏపీలో పెట్టుబడులపై వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.. ఫిలిప్ మోరిస్ సంస్థ ప్రతినిధితో భేటీ అయిన ఆయన.. ఏపీలో స్మోక్ ఫ్రీ సిగరెట్ యూనిట్ ఏర్పాటుపై చర్చించారు.. ఏపీలో వ్యూహాత్మక విస్తరణకు.. ప్రకాశం, గుంటూరు పరిసర ప్రాంతాలు అనుకూలమని వెల్లడించారు.. జెడ్ ఎఫ్ ఫాక్స్కాన్ సీఈవోతో సమావేశమయ్యారు లోకేష్.. సప్లయ్ చైన్ కార్యకలాపాల విస్తరణకు ఏపీ అనుకూలమని వివరించారు.. ఏపీలో వాహన తయారీ యూనిట్ నెలకొల్పాలని కోరారు…
దావోస్ వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దావోస్ సీఐఐ సెషన్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలు.. పెట్టుబడుల అంశంపై మాట్లాడిన ఆయన.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతూ.. సరైన సమయమంలో దేశానికి సరైన వ్యక్తి ప్రధానిగా ఉన్నారన్నారు... మూడో సారి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని.. చాలా దేశాల్లో రాజకీయ సందిగ్ధత ఉంది... కానీ, భారతదేశంలో లేదన్నారు.
వ్యాపార, వాణిజ్య రంగాల్లో విజయం సాధించి.. గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్లుగా ఎదిగే సత్తా భారతీయల్లో ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... ప్రపంచంలో అందరికీ అత్యంత ఆమోదయోగ్యమైన ఏకైక కమ్యునిటీగా భారతీయులు గుర్తింపు పొందారన్నారు.. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రెండో రోజున, భారత పరిశ్రమల సమాఖ్య ప్రత్యేక సెషన్లో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్పై ముఖ్యమంత్రి ప్రసంగించారు.
సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం వచ్చింది.. ఈ సమయంలో ఆర్టీసీ ఆదాయం రూ.23 కోట్లు దాటినట్టు ఆ సంస్థ ప్రకటించింది.. పండు సమయంలో 7200 బస్సులతో మొదలుపెట్టి 9,097 బస్సులు నడిపింది ఏపీఎస్ఆర్టీసీ.. మొత్తం 23.71 కోట్ల సంక్రాంతి పండుగ సమయంలో ఆదాయాన్ని ఆర్జించింది ఏపీఎస్ఆర్టీసీ..
ఆంధ్రప్రదేశ్ లో గతేడాది జరగాల్సిన గ్రూప్ -1 మెయిన్స్ ఎగ్జామ్స్ వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్షలపై అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బిగ్ అలర్ట్ ఇచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఎపీపీఎస్సీ ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరపాలని ఎపీపీఎస్సీ నిర్ణయించింది. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను డిస్క్రిప్టివ్ టైప్ లో…
విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు... క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా సభ్యుల్లో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసామన్నారు పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి.. ఈ ముఠాతో పెద్ద తలకాయలకు సంబంధాలు ఉన్నాయని, వాళ్లను కచ్చితంగా పట్టుకుంటామన్నారు.. క్రికెట్ బెట్టింగ్ లో ఇన్వాల్వ్ అయిన ఓ హెడ్ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసి ఎంక్వయిరీకి ఆదేశించామన్నారు..
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది.. అందులో భాగంగా గీత కులాలకు 335 మద్యం షాపులు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.. ఇక, గీత కార్మికులకు 335 మద్యం షాపులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది.. జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధికారి షాపులకు అప్లికేషన్లు కోసం నోటిఫికేషన్ జారీ చేసింది..
అర్హులైన వారికి 18 అంకణాల ఇంటి నివాస స్థలాలు ఇస్తామని తెలిపారు సర్వేపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన అదనపు భవనాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.50 లక్షలతో అదనపు భవనాన్ని నిర్మించాం.
డిప్యూటీ సీఎం అంశంపై జనసేన అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఉప ముఖ్యమంత్రి అంశంపై ఎవరూ మాట్లాడొద్దని స్పష్టం చేసింది.. డిప్యూటీ సీఎం విషయంలో మీడియా ముందు గానీ, సోషల్ మీడియాలో గానీ.. ఎవరూ స్పందించవద్దని మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది..