Rahul Gandhi: “కావాలనే నన్ను మాట్లాడనివ్వడం లేదు”.. స్పీకర్‌కు రాహుల్ గాంధీ లేఖ..
- నన్ను కావాలనే మాట్లాడనివ్వడం లేదు..
- ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ..
- స్పీకర్‌కు రాహుల్ గాంధీ లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. జాతీయ భద్రతకు సంబంధించిన విషయంలో సభలో మాట్లాడే హక్కును నిరాకరించడాన్ని నిరసించారు. తన లేఖలో.. రాష్ట్రపతి ప్రసంగంపై తీర్మానంపై చర్చ సందర్భంగా తనను మాట్లాడటానికి అనుమతించలేదని రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం తాను మాట్లాడుతున్నప్పుడు 2020 నాటి భారత్-చైనా ఘర్షణను ప్రస్తావిస్తూ, తాను ఒక మ్యాగజైన్‌లో వచ్చిన కథనాన్ని ఉదాహరణగా ప్రస్తావించడాన్ని స్పీకర్ ధ్రువీకరించాలని కోరారని అన్నారు.
Read Also: Airtel Unlimited Plans 2026: ఎయిర్‌టెల్ నయా ప్రీపెయిడ్ ప్లాన్స్.. రూ.399, 449కే అన్‌లిమిటెడ్ డేటా!
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం, ఒక సభ్యుడు ఏదైనా డాక్యుమెంట్‌ను ప్రస్తావించాలంటే దానిని ధ్రువీకరించాల్సిన బాధ్యత ఉందని, తాను ఆ విధానాన్ని పూర్తిగా పాటించానని రాహుల్ గాంధీ చెప్పారు. అయినప్పటికీ తనను మాట్లాడనీయలేదని లేఖలో పేర్కొన్నారు. ‘‘నన్ను ఉద్దేశపూర్వకంగా మాట్లాడనివ్వలేదనే అనుమానం కలుగుతోంది. ప్రతిపక్ష నాయకుడు జాతీయ భద్రత వంటి కీలమైన అంశంపై మాట్లాడనీయకపోవడం ప్రజాస్వామ్యానికి మచ్చ’’ అని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రపతి ప్రసంగంలో జాతీయ భద్రత ప్రధానాంశంగా ఉందని, దీనిపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే అని రాహుల్ గాంధీ అన్నారు. స్పీకర్ రాజ్యంగబద్ధంగా, పార్లమెంటరీ బాధ్యతలతో తటస్థంగా ప్రతీ సభ్యుడి హక్కుల్ని కాపాడాలని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ప్రతిపక్ష నేతనైన తనను రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడనీయలేదని ఆరోపించారు. ఇలా పార్లమెంటరీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని రాహుల్ గాంధీ అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని, దీనిపై తాను నిరసన తెలుపుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!