Vallabhaneni Vamsi: కృష్ణా జిల్లాలోని గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి కృష్ణలంక పోలీస్స్టేషన్లో విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా వంశీ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేస్తున్నారు. కాసేపట్లో వైద్య పరీక్షల కోసం విజయవాడలోని జీజీహెచ్కు తరలించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఎస్సీ, ఎస్టీ కోర్టులో అతడ్ని హాజరు పర్చనున్నారు. మరోవైపు, విశాఖపట్నం నుంచి విజయవాడలోని పటమట పోలీస్స్టేషన్కు సత్యవర్థన్ను పోలీసులు తీసుకొచ్చారు. సత్యవర్థన్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
Read Also: Noise Master Buds: మార్కెట్‌లోకి నాయిస్ మాస్టర్ బడ్స్.. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్.. ధర ఎంతంటే?
అయితే, సత్య వర్ధన్ ను కిడ్నాప్ చేసి దాడి చేసి కేసు వెనక్కి తీసుకునేలా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేశారని అతని సోదరుడు ముదునూరి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదుపై వంశీపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వంశీని అరెస్ట్ విషయం తెలిసి కృష్ణలంక పోలీస్స్టేషన్ దగ్గరకు వచ్చిన ఆయన భార్య.. అతడ్ని కలిసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో పోలీస్ స్టేషన్ బయటే ఆమె ఉండిపోయింది.