Minister Atchannaidu: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అక్రమం అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.. తప్పుడు కేసులు బనాయించి.. అరెస్ట్ చేశారని ఫైర్ అవుతున్నారు.. అయితే, వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్‌పై స్పందించిన ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడిని అందరూ చూశారని గుర్తుచేసిన ఆయన.. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరిగింది.. ఇందులో ఎలాంటి రహస్యం లేదని స్పష్టం చేశారు.. అయితే, ఫిర్యాదు చేసిన వ్యక్తి కేసును విత్‌డ్రా చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది.. పార్టీ కార్యాలయంలో పని చేసిన వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఇలా జరుగుతుందా..? వాళ్ల కుటుంబంపై ఎంత ఒత్తిడి తెచ్చిఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Delhi New CM: ఢిల్లీ సీఎం ఎంపికకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..!
ఇక, దాడికి ప్రతి దాడి చేయాలంటే 8 నెలలు కావాలా…? అని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు.. గత ఐదేళ్లలో ఇలా జరిగి రాష్ట్రం నష్టపోయిందన్న ఆయన.. కార్యకర్తలు బూతులు తిట్టినా కూడా.. దాడికి ప్రతిదాడి మంచి విధానం కాదు అని హితవుచెప్పారు.. అలా అని చేతులు కట్టుకుని ఉండబోమని వార్నింగ్ ఇచ్చారు.. ఎవరు తప్పు చేసినా.. వదిలే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.. ఇప్పుడు అదే జరుగుతోందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.. కాగా, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన వల్లభనేని వంశీని విజయవాడకు తరలించిన పోలీసులు.. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో అనేక కోణాల్లో సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు పోలీసులు.. టీడీపీ గన్నవరం కార్యాలయంపైన దాడి గురించి ప్రశ్నిస్తున్నారు పోలీసులు.. దాడిలో ఎంత మంది పాల్గొన్నారు.. దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందనే కోణంలో వంశీని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.. విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ GGHకు వంశీని తరలించనున్నారు పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం విజయవాడ SC,ST కోర్టులో హాజరు పర్చనున్నారు..