Vallabhaneni Vamsi Arrest: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు.. విజయవాడకు తరలించారు.. అయితే, వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు.. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ తో పాటు పోలీస్ యాక్ట్ – 30 అమలులో ఉన్నట్టు పేర్కొన్నారు.. ఈ సెక్షన్ అమలు నేపథ్యంలో నిరసనలు, ర్యాలీలపై పూర్తిగా నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు.. అయతే, పోలీసుల నిషేదాజ్ఞలను అతిక్రమించి వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు.
Read Also: Microsoft: హైదరాబాద్ జర్నీలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయి: సీఎం
ఇక, హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్లిన పోలీసులు.. ముందుగా భవానీపురం పీఎస్‌కు వల్లభనేని వంశీని తలించారు.. అక్కడ వాహనాన్ని మార్చి మరో చోటుకు తరలించే ప్రయత్నం చేశారు పటమట పోలీసులు.. అయితే, మార్గమధ్యలో పోలీసులతో వంశీ వాగ్వాదానికి దిగారు.. నేనేమైనా కోడినా ఏంటి..? లోపల పెట్టి పార్శిల్ చేయడానికి అంటూ పోలీసుపై ఫైర్ అయ్యారు.. ఆ తర్వాత వంశీని కృష్ణలంక పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు.. పోలీస్ స్టేషన్‌లో ప్రస్తుతం వంశీని విచారిస్తున్నారు.. అ తర్వాత వైద్య పరీక్షలకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించనున్నారు.. వైద్య పరీక్షల అనంతరం గవర్నర్ పేటలో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యక న్యాయస్థానంలో వల్లభనేని వంశీ మోహన్‌ను హాజరుపర్చనున్నారు పోలీసులు.