AP MLC Elections 2025: ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పది మంది అభ్యర్థులు ఉన్నారని విశాఖ పట్నం జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి హరేందిర ప్రసాద్ తెలిపారు. మొత్తం 20 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. అందులో నాలుగు నామినేషన్లు తిరస్కరించాం.. 16 నామినేషన్లకు ఆమోదం తెలిపాం.. ఒక్కరు కూడా నామినేషన్ ను ఉపసంహరించుకోలేదని పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని విశాఖ కలెక్టర్ హరేందిర చెప్పుకొచ్చారు.
Read Also: Vallabhaneni Vamsi: కాసేపట్లో వైద్య పరీక్షల కోసం జీజీహెచ్కు వల్లభనేని వంశీ తరలింపు..
ఇక, మార్చ్ 3వ తేదీన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని విశాఖ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి హరేందిర ప్రసాద్ చెప్పారు. ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రారంభం అవుతుంది.. ఎన్నిక నిర్వహణ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం.. పటిష్టమైన భద్రత నడుమ ఎన్నికలు నిర్వహిస్తాం అన్నారు. సాధారణ ఎన్నికల మాదిరిగానే ఓటర్ స్లిప్స్ ఇస్తాం.. ఓటింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తేల్చి చెప్పారు.