ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు వాహనదారులు ఉల్లంఘనలకు పాల్పడుతుంటారు. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, రాంగ్ రూట్ లో వెళ్లడం, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంపింగ్ లకు పాల్పడుతూ ప్రమాదాలకు కారణమవుతుంటారు. ఇలాంటి వారికి భారీగా జరిమానాలు విధించినప్పటికీ ఏ మాత్రం మార్పురావడం లేదు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ అధికారులు కఠినమైన రూల్స్ తీసుకొస్తున్నారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి కొత్త మోటార్ వెహికల్ చట్టాన్ని అమలు చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో వాహనదారులకు బిగ్ అలర్ట్ అందించారు. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే భారీగా ఫైన్ విధించనున్నారు.
Also Read:RK Roja: రాష్ట్ర ప్రజలకు ఈ బడ్జెట్ ఎందుకు ఉపయోగపడదు..
కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ అమల్లోకి వస్తే.. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ.1,000 ఫైన్ విధించనున్నారు. సీట్ బెల్ట్ లేకుండా కార్ నడిపితే రూ.1,000 జరిమానా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్టు తేలితే రూ.10,000 ఫైన్ – లైసెన్స్ రద్దు చేస్తామని అధికారులు తెలిపారు. ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ లో వెళితే రూ. 1,000 ఫైన్ విధించనున్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.5,000 జరిమానా.. వాహనం సీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించే వాహనదారులను సీసీ కెమెరాల ద్వారా కూడా గుర్తించి ఫైన్స్ విధించనున్నారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇకపై తక్షణమే జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు.