Nagababu: శాసన మండలిలో అడుగుపెట్టబోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన నుంచి బరిలోకి దిగిన ఆయన ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.. అయితే ఈ సందర్భంగా.. తాను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు నాగబాబు.. నా బాధ్యతను పెంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి కృతజ్ఞతలు తెలిపారు.. ఇక, నాతో పాటుగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు నాగబాబు.
Read Also: Mining Mafia: రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా.. పగలు, రాత్రి తేడా లేకుండా తవ్వకాలు..!
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికయ్యేందుకు నాకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా అభినందలు తెలియజేస్తూ.. ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు నాగబాబు.. ప్రభుత్వ పరిపాలనలో ప్రజా సేవ చేసేందుకు గాను.. ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎన్నికయ్యే అకవాశం కల్పించి.. నా బాధ్యతను పెంచారంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు.. ఇక, నాతో పాటు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన గ్రీష్మ ప్రసాద్, సోము వీర్రాజు, తిరుమల నాయుడు, బీద రవిచంద్రకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. నామినేషన్ దాఖలు సందర్భంగా నాతో వెన్నంటి ఉన్న మంత్రులు నాదెండ్ల మనోహర్, నారా లోకేష్, పి. విష్ణుకుమార్ రాఉ, కొణతాల రామకృష్ణ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు.. నా అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకాలు చేసిన నాదెండ్ల మనోహర్, మండల బుద్ధప్రసాద్, లోకం నాగ మాధవి, ఆరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్, ధర్మరాజు, అరవ శ్రీధర్, బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీ గారికి అభినందనలు తెలిపారు.. నా ఇన్నేళ్ల రాజకీయ ప్రయాణంలో నాతో కలిసి పని చేసిన సహచరులకు, మిత్రులకు, మీడియా ప్రతినిధులు.. ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, మొత్తం జనసేన కుటుంబానికి ఆత్మయ అభినందనలు అంటూ..ఎవ్వరినీ వదలకుండా అందరికీ అభినందనలు తెలిపారు నాగబాబు..
ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు
-నా బాధ్యతను పెంచిన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు
-నాతో పాటుగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు-మీ నాగబాబు.@JanaSenaParty @PawanKalyan @ncbn pic.twitter.com/vHdl1KEkfs
— Naga Babu Konidela (@NagaBabuOffl) March 14, 2025