Bike Racing: వీకెండ్స్ వచ్చిందంటే చాలు.. రెచ్చిపోతున్న బైక్ రేసర్లు..!
- విశాఖలో రెచ్చిపోతున్న బైక్ రేసర్లు..
- వీకెండ్స్‌లో ఎక్కువగా బైక్ రేసింగ్‌లు..
- బైక్ రేసింగ్‌లపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు..
- గతవారం రోజుల్లోనే 54 మంది రేసర్లను పట్టుకున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bike Racing: సాగర నగరం విశాఖపట్నంలో బైక్ రేసింగ్‌లకు కళ్లెం వేయడానికి సీసీ శంఖ బ్రతబాగ్చి దృష్టిసారించారు. వీకెండ్స్‌లో బైక్‌రేసింగ్‌లు ఎక్కువగా జరుగుతుండడంతో ప్రత్యేక నిఘా పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. గతవారం రోజుల్లోనే 54 మంది రేసర్లను పోలీసులు పట్టుకున్నారు. గతంలో నగరశివారు ప్రాంతాల్లో అకస్మాత్తుగా జరిగే రేసింగ్‌లు.. వీకెండ్స్‌లో సాధారణంగా మారిపోయాయి. పైగా శివారు ప్రాంతాలకు కాకుండా నగరం నడిబొడ్డునే రేసింగ్‌లు నిర్వహిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.. ఇటీవల నగరంలో రాత్రివేళ పరిస్థితిని పరిశీలించేందుకు సీపీ శంఖబ్రతబాగ్చి అర్ధరాత్రి దాటిన తర్వాత స్వయంగా నిఘా పెట్టారు. ఆ సమయంలో కొంతమంది యువకులు బీచ్‌రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సిరిపురం తదితర ప్రాంతాల్లో బైక్‌లతో రేసింగ్ నిర్వహించడం గుర్తించారు.
Read Also: India: బుద్ధి మార్చుకోని పాక్.. రైలు హైజాక్ పై తీవ్ర ఆరోపణలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
Also Read
- Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
దీంతో నగరంలో రేసింగ్‌లకు అడ్డుకట్టవేయాలని సిబ్బందిని ఆదేశించారు. గస్తీ పెంచడంతో బైక్ రేసర్లు వరుసగా పట్టుబడుతున్నారు. ఈనెల రెండో తేదీన 38 మంది రేసర్లను అదుపులోకి తీసుకున్నారు. ఏడో మరో 18 మంది పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి బైక్‌లను స్వాధీనం చేసుకుని, కేసులు నమోదుచేశారు. పట్టుబడిన యువకుల తల్లిదండ్రులను పిలిపించి, కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇలాంటి రేసింగ్‌లు నగరంలో బీచ్‌రోడ్డుతోపాటు బీఆర్‌టీఎస్‌రోడ్డు, మారికవలస నుంచి ఐటీ హిల్స్‌కు వెళ్లేరోడ్డు, రుషికొండ, తిమ్మాపురం బీచ్‌రోడ్డులో ఎప్పటికప్పుడు జరుగుతుంటాయని పోలీసులే చెబుతున్నారు.. రేసింగ్‌కు పాల్పడేవారంతా వాట్సాప్, ఇన్‌స్టాల్లో గ్రూపులుగా ఏర్పడి సమాచారం అందించుకుంటున్నారు. ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుని పోలీసుల రాకను గమనిస్తూ.. జిగ్‌జాగ్‌లు, స్పీడ్ డ్రైవింగ్, స్టంట్‌ల పోటీలు పెట్టుకుంటున్నారు. ఆ సమయంలో అదే రోడ్డుపై వెళ్లే వాహనదారులు, స్టంట్‌లు చేసే యువకులు ప్రమాదాల బారిన పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. యువత ప్రాణాలను బలిగొంటున్న రేసింగ్‌లపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు నగరవాసులు.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?