* నేడు పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. ఇరిగేషన్ ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ.. NDSA రిపోర్ట్, ఎయిర్ పోర్టులపై సమీక్షించనున్న సీఎం..
* నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు..
* నేడు హన్మకొండ జిల్లాలో మంత్రుల పర్యటన.. దేవాదుల ప్రాజెక్టును పరిశీలించనున్న మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క.. అనంతరం కలెక్టరేట్ లో మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష..
* నేడు రెండోరోజు సిట్ కస్టడీకి రాజ్ కేసిరెడ్డి.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు విచారణ.. వారం రోజుల పాటు కేసిరెడ్డిని విచారించనున్న సిట్ అధికారులు..
* నేటి నుంచి ఏపీలో ఈ నెల 9 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. మొత్తం 89 పోస్టులకు జరుగనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు..
* నేడు విశాఖలో ఒకే దేశం- ఒకే ఎన్నిక కార్యక్రమం.. బీజేపీ ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమం.. హాజరుకానున్న ఎంపీ లక్ష్మణ్..
* నేడు సింహాచలం ఘటనపై ప్రాథమిక నివేదిక.. ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వనున్న కమిటీ.. నిబంధనలకు విరుద్ధంగా గోడ నిర్మించినట్టు నిర్థారణ..
* నేడు సింహాచలంలో సంప్రోక్షణ, శాంతి హోమం.. ఇటీవల సింహాచలంలో గోడ కూలి ఏడుగురు మృతి..
* నేటి నుంచి తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు.. జూన్ 6వ తేదీ వరకు ప్రకటన.. సెలవుల నేపథ్యంలో స్పెషల్ బెంచ్ లు ఏర్పాటు.. హైకోర్టులో 5 బెంచ్ లతో అత్యవసర కేసుల విచారణ..
* తెలంగాణలో నేటి నుంచి డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు.. ఇవాళ్టి నుంచి ఈ నెల 21 వరకు దరఖాస్తుల స్వీకరణ.. తెలంగాణలో మూడు విడతల్లో డిగ్రీ అడ్మిషన్లు..
* నేడు ఆస్ట్రేలియా పార్లమెంట్ ఎన్నికలు.. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్న 1.8 కోట్ల మంది..
* నేడు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు.. రాత్రి 7.30 గంటలకి బెంగళూరు వేదికగా మ్యాచ్..