రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్వాగతం పలికారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని #Amaravati నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను.. రాష్ట్ర ప్రజల కలల రాజధాని నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిది.. రాష్ట్రంలో ప్రతి పౌరునికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రజా రాజధానిగా అమరావతి ఆవిష్కృతం అవుతుంది.
కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చెప్పినా, ఏం మాట్లాడినా సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి ఉంది.. హోంమంత్రి వంగలపూడి అనితపై గతంలో కొన్ని విమర్శలు చేశారు పవన్ కల్యాణ్.. అసలు తానే హోమ్ మంత్రి అవుతా అని పవన్ హెచ్చరించారు కూడా... ఇప్పుడు లేటెస్టుగా అనితపై పొగడ్తలు కురిపించారు పవన్.. ఏదైనా సమస్య వస్తే హోమ్ మంత్రిగా అనిత వెంటనే స్పందించి.. సమస్య పరిష్కారంపై దృష్టి పెడుతున్నారని పవన్ పొగడ్తలు కురిపించారు..
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కి హైకోర్టులో ఊరట దక్కింది.. తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.. సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రిలో చెలరేగిన అల్లర్లలతో... ఆ రోజు నుంచి తాడిపత్రిలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి అనుమతి నిరాకరించారు పోలీసులు.. పోలీసులు తాడిపత్రిలోకి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని... జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని హైకోర్టును ఆశ్రయించిన కేతిరెడ్డి.. అయితే, తాడిపత్రి వెళ్ళేందుకు కేతిరెడ్డికి షరతులతో అనుమతి ఇచ్చింది హైకోర్టు..
ఏపీ లిక్కర్ కుంభకోణం కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డితోపాటు మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. వారంతా ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా రాజ్ కేసిరెడ్డి పీఏ పైలా దిలీప్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారం ఆయన దగ్గర ఉందని భావిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ అమరావతికి వస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చెయ్యబోతున్నారు. ఈ సందర్భంగా విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తెచ్చారు ఏపీ పోలీసులు. ఎవరు ఏ రూట్లో వెళ్లాలి అనే అంశంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ ఉదయం 5 గంటలకే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రాగా.. రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉండబోతున్నాయి..
రాజధాని అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది.. నేడు ఏపీ రాజధాని అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవుతున్నారు. మధ్యాహ్నం మూడున్నరకు అమరావతికి చేరుకోనున్న మోడీ.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు. మోడీ సభకు 5 లక్షల మంది జనం వస్తారని అంచనా వేస్తున్నారు కూటమి నేతలు..
అంతన్నాడింతన్నాడు.. అంతే లేకుండా పోయాడు. ఈసారి నేను ఓడిపోతే... మీసం తీసేసుకుంటానంటూ.. మెలేసి మరీ ఒట్టేశాడు. ఇప్పుడు మీసం సంగతి దేవుడెరుగు.. అసలు మనిషే కనిపించకుండా మాయమైపోయాడంటూ.... రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారట నియోజకవర్గంలో.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కొండెక్కిన ప్రతి భక్తుడు తృప్తిగా శ్రీవారి అన్న ప్రసాదాన్ని స్వీకరిచేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ. నిత్యాన్నదానంతోపాటు దర్శనాంతరం ఆలయంలో ప్రసాదాలు పంపిణీ చేస్తుంది దేవస్థానం.
ఒక షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి మతం మారితే కులం వర్తించదు.. అంతేకాదు.. అతని ఫిర్యాదుపై అట్రాసిటీ కేసు చెల్లదు అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు..