పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం.. వరుసగా మూడోసారి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మంత్రి నిమ్మల రామానాయుడు. మినిస్టర్‌గా రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో హవా నడిపిస్తున్నా... సొంత సెగ్మెంట్లో మాత్రం.... ఇంట్లో ఈగల మోత అన్నట్టుగా తయారైందట ఆయన పరిస్థితి.
YS Jagan: రేపు (ఏప్రిల్ 22వ తేదీన) తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం జరగనుంది.
Minister Nimmala: నేటి నుంచి రాజమండ్రి జిల్లాలో 45 ఇసుక ర్యాంపులకు అనుమతి ఇస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోదావరి వరదల నేపథ్యంలో నాలుగు నెలలు ఇసుక కొరత రాకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యగా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ఎయిర్ పోర్టు దగ్గర కాపు కాసిన సిట్ అదుపులోకి తీసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రాజ్ కేసిరెడ్డి. మూడు సార్లు సిట్ నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదు కేసిరెడ్డి.. రేపు విచారణకు వస్తానంటూ ఈ మధ్యాహ్నం ఆడియో విడుదల చేశారు. రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్ పై…
AB Venkateswara Rao: కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీని రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కలిశారు. ఈ సందర్భంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును పునర్విచారణ చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం డెడ్‌లైన్ మారిపోయింది.. మరో ఆరు నెలల ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. గోదావరి పుష్కరాల నేపథ్యంలో 2027 జూన్ నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని అనుకుంటున్నామని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
క్రికెట్ గ్రౌండ్‌లోనే గుండె ఆగి.. యువకులు చనిపోయిన సందర్భాలు లేకపోలేదు.. అలాంటి ఘటన ఇప్పుడు పల్నాడు జిల్లాలో జరిగింది.. జిల్లాలోని వినుకొండలో క్రికెట్ ఆడుతూ గుండెపోటుకు గురైన గౌస్ బాషా అనే యువకుడు కుప్పకూలిపోయాడు.. అయితే, వెంటనే ఆస్పమత్తమైన తోటి క్రికెటర్లు.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు గౌస్ భాష..
కూటమి ప్రభుత్వంలో తీసుకుంటున్న ప్రతి చర్యతో మాజీ సీఎం వైఎస్ జగన్‌కు జ్ఞానోదయం కలగాలని వ్యాఖ్యానించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. పార్వతిపురం మన్యం జిల్లాలో అంబేద్కర్ జయంతి వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన.. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖలో మేయర్ గా కుటమి అభ్యర్థి విజయం సాధించారు.. జగన్మోహన్ రెడ్డి దీనిపై మాట్లాడుతూ రాష్ట్రంలో గడ్డు పరిస్థితి ఏర్పడిందని విమర్శించడం దారుణం అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఇవాళ్టితో ముగియనుంది.. దీంతో ఈరోజు అర్ధరాత్రికి దేశ రాజధాని ఢిల్లీ చేరుకోనున్నారు ఏపీ సీఎం.. అయితే, రేపు ఢిల్లీలో ఏపీ సీఎం కీలక సమావేశాలు ఉన్నాయి..