పీఏసీ సమావేశంలో ఏపీ ప్రభుత్వంపై హాట్ కామెంట్లు చేశారు వైసీపీ అధినేత జగన్.. రోమన్ రాజుల కాలంలో గ్లాడియేటర్లను పెట్టి.. గ్యాలరీల్లో ప్రజలను పెట్టి, మనుషులను చంపుకునే పోటీలు పెట్టేవారు. వినోదం కింద రోజుకో దుర్మార్గమైన ఆటలు పెట్టి.. ప్రజలను అందులో మునిగేలా చేసేవారు. దీనివల్ల ప్రజలు తమ కష్టాలను, బాధలను వదిలేస్తారని అభిప్రాయం.. ఇప్పుడు మన పరిస్థితి అలానే ఉంది.. విశాఖలో 3వేల కోట్ల భూమిని ఊరుపేరులేని కంపెనీకి రూపాయికే కట్టబెట్టారు.
టీచర్ తన సెల్ ఫోన్ తీసుకున్నరని ఓ విద్యార్థిని ఏకంగా చెప్పుతో కొట్టింది. ఇప్పుడు ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ విచారకరమైన ఘటన విశాఖ, విజయనగరం మధ్య దాకమ్మరిలో ఉన్న ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చోటు చేసుకుంది.
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కీలక అంశాలపై చర్చించారు.. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్ర శేఖర్, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కృష్ణ ప్రసాద్, అప్పలనాయుడు, హరీష్ బాలయోగి, సానా సతీష్ తదితరలు పాల్గొన్నారు..
లిక్కర్ స్కామ్‌పై సోషల్ మీడియా వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి.. ''ఏపీ లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర విజిల్ బ్లోయర్ మాత్రమేనని పేర్కొన్నారు.. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు కూడా నా పేరుని లాగుతున్నారని మండిపడ్డ ఆయన.. ఏ రూపాయి నేను ముట్టలేదు.. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు.. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను''
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు.. ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ కేసులో నిందితుడిగా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులును.. ఇవాళ ఉదయం బేగంపేటలోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విజయవాడకు తరలించారు.. సాయంత్రంలోగా పీఎస్సార్ ఆంజనేయులును అరెస్ట్ చేసినట్టు అధికారికంగా చూపే అవకాశం ఉంది..
ఏపీ పాలిటిక్స్‌లో తాజా ట్రెండింగ్ లీడర్... వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని, ఇక తాను వ్యవసాయం చేసుకుంటానని చెప్పి వెళ్లిపోయాక... కాకినాడ పోర్టు కేసులో ఆయన ఏ2 గా కేసు ఫైల్ అయింది.
వైసీపీ పాలనలో అడ్డమైన కేసులతో అష్టకష్టాలు పడ్డామని చెబుతుంటారు ఉమ్మడి చిత్తూరు జిల్లా టిడిపి లీడర్స్ అండ్ కేడర్.అక్రమ కేసులతో ఊళ్ళు విడిచి వెళ్ళిన వాళ్ళు సైతం ఉన్నారని అంటారు. కానీ... ఇప్పుడు ప్రభుత్వం మారినా, మా పరిస్థితి మాత్రం మారలేదు. ఏంటీ ఖర్మ మాకు అంటూ తలలు పట్టుకుంటున్నారట తమ్ముళ్ళు. మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ కేడర్ బాధ అంతా ఇంతా కాదని అంటున్నారు.