భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాన్ వీరమరణం పొందాడు.. జమ్మూ కాశ్మీర్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు విడిచారు.. పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు జవాన్ మురళీ నాయక్.. ఆయన స్వస్థలం ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా.. రేపు కల్లితండాకు మురళీ నాయక్ పార్థివదేహాన్ని తరలించేందుకు భారత ఆర్మీ ఏర్పాట్లు చేసింది..
తిరుమలలో మరోసారి కలకలం రేగింది.. ఇవాళ ఉదయం నుంచి శ్రీవారి ఆలయం మీదుగా ఐదు విమానాలు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది.. ప్రతి నిత్యం తిరుమల కొండ పై ఆలయానికి సమీపంలో తరుచూ విమానాలు వెళ్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆపరేషన్ సిందూర్ను అభినందిస్తూ ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది.. ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన త్రివిధ దళాలకు అభినందనలు తెలిపింది.. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపింది కేబినెట్..
చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి.. మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే, ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ వదిలిపెట్టబోం.. మనం అధికారంలోకి వచ్చాక, వారిని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు..
ఎవ్వరినీ వదలం.. ఎక్కడున్నా.. కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోండి అని సూచించారు వైఎస్ జగన్.. ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. అది మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది కర్నూలు జిల్లా కోర్టు.. ఈ కేసులో నిందితులగా ఉన్న 11 మందికి జీవిత ఖైదు విధించింది.. ఈ మేరకు జిల్లా జడ్జి కబర్ది తీర్పు చెప్పారు. 2017 మే 21న వివాహానికి వెళ్లి వస్తుండగా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం శివారులో నారాయణరెడ్డి వాహనాన్ని అడ్డగించి నరికి హత్య చేశారు. ఈ హత్య కేసులో మొత్తం…
మొత్తం 31 అంశాలతో ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది.. ఈ సమావేశంలో రాజధాని అమరావతి చట్టబద్ధతపై ప్రత్యేక చర్చ సాగుతోంది.. విభజన చట్టంలో రాజధాని అనే అంశం దగ్గర అమరావతి అని ఉండేలా కసరత్తు చేస్తోంది కూటమి సర్కార్.. దీనిపై కేబినెట్లో చర్చించి కేంద్రానికి పంపే ఆలోచనలో ఉంది.. అయితే, ఈ రోజు ఏపీ కేబినెట్కు ముగ్గురు మంత్రులు దూరంగా ఉన్నారు..