Off The Record: ఏపీ ప్రభుత్వం, టీడీపీలో భారీ మార్పులు.. కీలకంగా మారనున్న నారా లోకేష్
- మహానాడు తర్వాత పార్టీ, ప్రభుత్వంలో మార్పులు?..
- పార్టీలో మార్పులపై మహానాడులోనే నిర్ణయాలు?..
- టీడీపీలో లోకేష్ మరింత కీలకం కాబోతున్నారా?..
- లోకేష్‌కు యాక్టివ్ రోల్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారా?..
- పార్టీ రాష్ట్ర కమిటీ, పొలిబ్యూరోలో భారీ మార్పులు?..
- యువతకు ఎక్కువ అవకాశం ఇచ్చే ఛాన్స్..
- జూన్ 12తో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి..
- జిల్లా కలెక్టర్లతో బదిలీల పర్వం మొదలవుతుందా?..
- మంత్రివర్గంలో కూడా కీలక మార్పులు ఉంటాయా?..
- కొందరు మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి..
- పనితీరును బట్టి శాఖల్లో భారీ మార్పులు ఉంటాయా?..
- మహానాడు ముగిశాక పార్టీ, ప్రభుత్వంలో భారీ మార్పులేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, అలాగే తెలుగుదేశం పార్టీలో భారీ మార్పులు ఉండబోతున్నాయా? అందుకు ముహూర్తం కూడా ఖరారైందా? టీడీపీలో లోకేష్ మరింత కీలకం కాబోతున్నారా? అలాగే ప్రభుత్వ అదికారుల్ని కూడా టాప్ టు బాటమ్ మార్చేస్తారా? ఇవన్నీ ఎప్పుడు జరగబోతున్నాయి? ఛేంజెస్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయి?
Read Also: Alcohol : మందు తాగితే నిద్ర బాగా పడుతుందా? ఈ వాదనలో నిజమెంత…!
Also Read
తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా… కడపలో మహానాడు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తోంది. గురువారంతో…. ఈ మూడు రోజుల వేడుక ముగుస్తుంది. ఇక వచ్చే నెల 12తో కూటమి ప్రభుత్వం ఏడాదిపాలన పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో పూర్తి స్థాయి మార్పులు, చేర్పులకు సిద్ధమవుతున్నారట సీఎం చంద్రబాబు. ఇటు పార్టీ పరంగా కీలక మార్పులు చేయటం, అటు ప్రభుత్వంలో పూర్తిగా ప్రక్షాళన చేయలాంటి పనులు మొదలుపెట్టబోతున్నట్టు సమాచారం. పార్టీలో చేయబోయే మార్పులకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న మహానాడులోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. టీడీపీలో లోకేష్‌కి కూడా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
Read Also: NIA Investigation: సిరాజ్, సమీర్ విచారణ.. బయటపడుతున్న కీలక విషయాలు
అయితే, వచ్చే నాలుగేళ్లలో పార్టీని మరింత పటిష్టం చేసే క్రమంలో… ఆయనకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించవచ్చంటున్నారు. సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పరిపాలన మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తారు కాబట్టి… పార్టీ వ్యవహారాల్లో లోకేష్‌కు మరింత యాక్టివ్ రోల్ ఇవ్వాలనుకుంటున్నారట. అందులో భాగంగానే పార్టీలో కీలక మార్పులు ఉంటాయని, ఆ విషయంలో చంద్రబాబు కూడా ఓ క్లారిటీకి వచ్చేశారన్నది టీడీపీ వాయిస్. ఆ విషయంలో ఇప్పటికే కొన్ని సంకేతాలు వెలువడ్డాయి. రెండు మూడు సార్లు పార్టీ పదవులు తీసుకున్న వాళ్ళు పక్కకు తప్పుకోవాలి, కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే స్టేట్‌మెంట్ ఇచ్చారు లోకేష్. దీంతో మహానాడు తర్వాత పార్టీలో కచ్చితంగా మార్పులు ఉంటాయని అంటున్నాయి టీడీపీ వర్గాలు. పార్టీ రాష్ట్ర కమిటీల్లో, పొలిట్ బ్యూరోలో కూడా భారీ మార్పులే ఉండవచ్చని తెలుస్తోంది. పార్టీ పరంగా లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించి…. అన్ని వ్యవహారాలు, నిర్ణయాల్లో ఆయన కీలక పాత్ర పోషించేలా ప్లాన్ చేస్తున్నారట చంద్రబాబు. ఇందుకోసం పొలిట్ బ్యూరోలో, కార్యవర్గంలో యువతకు ఎక్కువ అవకాశాలు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక జూన్ 12తో కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తి అవుతుంది గనుక ఆ పరంగా కూడా గట్టి ఛేంజెస్ ఉంటాయని భావిస్తున్నారు.
Read Also: Rishabh Pant: పంత్ సూపర్ సెంచరీ.. గ్రౌండ్ లోనే స్పైడర్ మ్యాన్ లా పల్టీలు కొట్టి సెలబ్రేషన్స్
ఇక, దీనికి సంబంధించి ప్రాధమిక కసరత్తు జరిగినట్టు చెప్పుకుంటున్నారు. ముందుగా భారీ ఎత్తున అధికారుల బదిలీలు ఉంటాయని తెలుస్తోంది. కొన్ని జిల్లాల కలెక్టర్లను మార్చడంతోనే ఈ ప్రక్రియ మొదలవుతుందట. తర్వాత ఉన్నతాధికారులు, విభాగాల వారీగా ఆఫీసర్స్ ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయట. ఇక మంత్రివర్గంలో కూడా కీలక మార్పులు చేయడానికి సీఎం చంద్రబాబు రెడీ అవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం కొంతమంది మంత్రుల పనితీరు మీద తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట ఆయన. అలాంటి వాళ్ళని తప్పనిసరిగా మారుస్తారన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. అలాగే కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ… ఏడాదిలోనే మంత్రులను మారిస్తే బయటికి తప్పుడు సంకేతాలు వెళ్తాయేమోనని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అలాంటప్పుడు పూర్తిగా తప్పించకున్నా…. మంత్రుల పనితీరును బట్టి శాఖల్లో మార్పులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇలాంటి రకరకాల అంశాలను దృష్టిలో ఉంచుకుని కేబినెట్ మార్పుల కసరత్తు జరగవచ్చంటున్నారు. మొత్తానికి మహానాడు తర్వాత ఇటు పార్టీ పరంగా, అటు ప్రభుత్వ పరంగా గట్టి మార్పులే ఉండవచ్చంటున్నాయి తెలుగుదేశం వర్గాలు. అయితే అవి ఏస్థాయిలో ఉంటాయో, రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!