ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. అధికారికంగా ఎన్టీఆర్ జయంతి వేడుకులను జరపాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక నుండి ప్రతీ సంవత్సరం మే 28 తేదీన ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుకగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం...
తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుతలు అలజడి సృష్టిస్తున్నాయి.. గతంలో భక్తులపై దాడి, ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉండడంతో టీటీడీ అప్రమత్తమైంది.. నిపుణులతో సమావేశం నిర్వహించారు టీటీడీ ఈవో శ్యామలరావు... అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల భద్రతకు అదనపు సిబ్బంది కేటాయించాలని నిర్ణయించారు. ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖ ద్వారా చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని.. టీటీడీ అటవీ, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆరోగ్య, విజిలెన్స్ శాఖలతో కలిసి అటవీ శాఖ సమన్వయంతో నడకమార్గంపై నిరంతర జాయింట్ డ్రైవ్…
మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు పెట్టారు పవన్ కల్యాణ్.. "మహానాడు... ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది ‘తెలుగు దేశం’ పార్టీనే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది ఏటా జరిగే మహానాడు వేడుక. రాయలసీమ గడ్డపై.. కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ నేడు ప్రారంభమైన శుభవేళ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, విద్యాశాఖా…
ఈశాన్య రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. మరోవైపు, వాయువ్య బంగాళాఖాతం ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం.. ఉత్తరదిశగా కదులుతూ వచ్చే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని.. 29న వాయుగుండంగా మారేందుకు ఛాన్స్ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎంపీ రోణంకి కూర్మనాథ్.. రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలతో పాటుగా, కొన్నిచోట్ల 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం…
మీడియాతో నారా లోకేశ్ చిట్‌చాట్‌లో తదుపరి సీఎం మీరేగా అన్న మీడియా ప్రశ్నకు లోకేశ్ సమాధానమిస్తూ.. ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముంది? అని ప్రశ్నించారు.. సీఎం చంద్రబాబు యంగ్ అండ్ డైనమిక్ నాయకులు.. ఆయన ఇంకా యువ నాయకుడే అని అభివర్ణించారు.. దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం చాలా అవసరం.. ప్రజలకు సేవ చేసేందుకు పదవితో సంబంధం లేదన్నారు నారా లోకేష్..
మహానాడు వేదికగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టీడీపీపై విరాళాల వర్షం కురిసింది.. కేవలం రెండు గంటల వ్యవధిలోనే 17 కోట్లకు పైగా విరాళాలు వచ్చినట్టు టీడీపీ ప్రకటించింది.. పార్టీ తరపున సేకరించిన విరాళాలు పార్టీ కోసమే కాకుండా, పేదలు, పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని వెల్లడించారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూంటారు. ఇక, వికేండ్ లో భక్తుల తాకిడి ఎక్కువగా వుంటే.. వేసవి సెలవుల్లో అయితే భక్తుల తాకిడి మరింత ఎక్కువగా వుంటుంది. దీనితో సర్వదర్శనం భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచివుండే సమయం కూడా అంతకంతకూ పెరుగుతుంది. టోకేన్ లేకుండా తిరుమల చేరుకునే సర్వదర్శనం భక్తులు స్వామివారి దర్శనభాగ్యం కోసం 24 గంటల సమయం వేచివుండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.