Karumuri Nageswara Rao: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు సుఖ శాంతులతో ఉండటం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఇంటికి వెళ్ళి రేషన్ అందించే పద్ధతి తీసేయడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజ్ ది షిప్ ను స్టాక్ ది షిప్ గా మార్చేశారని రేషన్ బియ్యం కోసం వెళ్లి వృద్దురాలు మరణించిన ఘటన తమను తీవ్రంగా కలిచి వేస్తుందన్నారు. ఏడాది కాలంలో ఒక్కరినైనా రేషన్ వ్యాన్ నిర్వాహకులు అక్రమాలకూ పాల్పడ లేదని, ఏజెన్సీ లో రేషన్ బియ్యం కోసం గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మాజీ మంత్రి కారుమూరి పేర్కొన్నారు.
Read Also: Realme C73 5G: కేవలం రూ.10,499లకే 6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్‌తో రియల్‌మీ C73 5G భారత్‌లో లాంచ్..!
అయితే, గెలిచిన వెంటనే ప్రగల్భాలు పలికిన మంత్రులు.. ధాన్యం కొనుగోలు చేస్తే రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వటం లేదని కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. డోర్ డెలివరీ వ్యాన్లను కొనసాగించాలి, ఆ సిబ్బందికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంక్రాతి, దీపావళి రెండింటిని మరచిపోయిన ప్రజలు.. జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు.