TDP Leader Brutally Murder: ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో రాజకీయ హత్యలు జరుగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పలు జిల్లాలో పలు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు.. తాజాగా, నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యాడు.. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. తాతా హోటల్ పక్కన జంపాలవారిపాలెంలో టీడీపీ నేత తోపూరి నరసింహం అనే వ్యక్తిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు బ్రహ్మయ్య అనే వ్యక్తి.. అంతటితో ఆగకుండా.. రెండు రోజులు నరసింహం మృతదేహాన్ని ముక్కలుగా నరికి బోరుబావిలో వేశాడు.. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. అయితే, నరసింహం నిమ్మతోట దగ్గర కాపలాదారుడిగా పనిచేస్తున్నాడట బ్రహ్మయ్య.. ఏ విషయంలో ఆ ఇద్దరి మధ్య వివాదం మొదలైంది.. నరసింహంను అంత దారుణంగా ఎందుకు హత్య చేశాడు లాంటి విషయాలు తెలియాల్సి ఉండగా.. నరసింహం కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. బోరుబావి దగ్గరకు వెళ్లి ఆధారాలను సేకరించే పనిలోపడిపోయారు.. అయితే, ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది..
Read Also: Ration Rice Distribution: ‘రేషన్’వార్.. కూటమి వర్సెస్ వైసీపీ..!