ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక్కసారిగా స్కూల్ టీచర్గా మారిపోయారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నీటి ఎద్దడితో ఎడారిగా మారకుండా ఉండాలంటే.. మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకతను వివరించారు నిర్మలా సీతారామన్.. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు క్లాస్ తీసుకున్న నిర్మలా సీతారామన్.. మొక్కల విశిష్టత - ఉపయోగాలు అంశంపై విద్యార్థులకు వివరించారు..
తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రానిదీ ఒక్కో కథ. తెలంగాణలో ఆదాయం తగ్గకపోయినా.. అప్పులు పెరుగుతున్నాయి. ఏపీలో ఆదాయం పెరగడం లేదు. అప్పులు పేరుకుపోతున్నాయి. పైగా అప్పులు తీర్చడానికి అప్పులు చేయక తప్పని విష విలయం రెండు రాష్ట్రాల్లో నడుస్తోంది.
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.. గత ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన సుగవాసి బాలసుబ్రమణ్యం.. ఇప్పుడు, టీడీపీకి గుడ్బై చెప్పారు.. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పంపారు సుగవాసి బాలసుబ్రమణ్యం..
రాజంపేట నియోజకవర్గం టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు రచ్చ కెక్కాయి. రాజంపేట తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ బత్యాల చెంగల రాయుడు కు ఇవ్వాలని మోకాళ్లపై కూర్చొని నినాదాలు చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వాన్ని నిలదీస్తూ దీనిపై సోషల్ మీడియాలో వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. రాజకీయ కక్షలతో చంద్రబాబు, ఆయన పార్టీనాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది.
కృష్ణా, గోదావరి డెల్టాలో పంటల సాగు వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాన్లు కంటే ముందుగానే పంటలు చేతికొచ్చేలా పంటల సాగు కాలంలో మార్పులు తీసుకురావాలని సూచన చేశారు. భూగర్భ జలాలు పెంచడం, రిజర్వాయర్లు నింపడం, జలవనరుల సమర్ధ వినియోగం.. ఈ 3 అంశాలపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. 365 రోజులు భూమి పచ్చగా ఉండేలా... 3 పంటలు నిరంతరం పండించేలా చూడాలన్నారు.
Maoist Special Story : మావోయిస్టు పార్టీ నానాటికి ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది ..పార్టీ అగ్ర నాయకులను కోల్పోతుంది.. పార్టీ కేంద్ర నాయకత్వం పట్టు తప్పు పోతుంది.. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్లో చనిపోగా ఇప్పుడు కిందిస్థాయి వాళ్లు కూడా ఎన్కౌంటర్లో చనిపోతున్నారు.. బతికున్న వాళ్లు చాలామంది లొంగిపోతున్నారు. మావోయిస్టు పార్టీ ఏర్పడిన వారు 44 మందితో కేంద్ర కమిటీ ఏర్పాటు అయింది ఇప్పుడు ఆ సంఖ్య 16కు తగ్గిపోయింది ఇందులో ఉన్నవాళ్లు చాలామంది ఎన్కౌంటర్లో చనిపోగా కొందరు…