జగన్ రెడ్డిని దేవుడు కూడా క్షమించడు అంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విరుచుకుపడ్డారు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును జగన్ రెడ్డి ఖండించడంతో ఆడపడుచుల పట్ల ఆయనకున్న ఆలోచనలు బయటపడ్డాయన్న ఆయన.. విశ్లేషకుడిగా కృష్ణంరాజు తెలుగు ఆడపడుచుల గురించి నీచాతినీచంగా, క్రూరంగా మాట్లాడుతుంటే ఆ క్షణమే ఖండించి, క్షమాపణ చెప్పించి, డిబేట్ నుంచి బహిష్కరించాల్సిన బాధ్యత కొమ్మినేనితో పాటు యాజమాన్యానికి లేదా..? అని ప్రశ్నించారు.
ఉపాధి హామీ పథకం పనుల కోసం 176.35 కోట్ల రూపాయల నిధుల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది.. 2025-26 ఏడాదిలో తొలి విడతగా మంజూరు చేసిన కేంద్ర నిధులను.. ఉపాధి హామీ పథకం పనుల కోసం విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. నిబంధనల మేరకు నిధులు వినియోగానికి చర్యలు తీసుకోవాలని ఏపీ పంచాయతీరాజ్ డైరెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి.. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారానికి ఒడిగట్టారు కామాంధులు.. రెండేళ్లుగా బాలిక శరీంపై దాడులు చేస్తూ.. అనేక రకాలుగా చిత్రహింసలకు గురిచేశారు.. ఇక, రెండేళ్లు మౌనంగా ఆ కామాంధుల శారీరక, మానసిక హింసను భరిస్తూ వచ్చిన ఆ బాలక.. తట్టుకోలేక చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చినట్టు అయ్యింది..
Breaking : ఒక ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకున్న వారి కలలు.. నిజానికి ఏకంగా బానిస జీవితం మారాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు ఒక భారీ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టుచేశారు. మస్కట్‌కి చెందిన వ్యక్తి సుందర్, అతని భారత భాగస్వామి సత్యనారాయణ కలిసి శతృవుల్లా అమాయకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇద్దరూ కలిసి దాదాపు 2 నుండి 4 లక్షల వరకు ప్రతి వ్యక్తిపై వసూలు చేస్తూ, దుబాయ్ షేక్‌లకు అమ్మేస్తున్న వైనం…
మృగశిర కార్తె ప్రవేశం రోజున చేపలకు ఎక్కువగా గిరాకీ ఉంటుంది. మామూలు రోజుల కంటే ఈ రోజున ఎక్కువగా చేపలు అమ్ముడు పోతాయి. ప్రతి ఒక్కరూ ఈ రోజున చేప ముక్క ఒక్కటైనా తినాలని చెబుతారు. ఇందుకు కారణాలు ఉన్నాయి. మామూలుగానే చేపలు తినడం వల్ల అనేక ప్రయజనాలు ఉన్నాయి. మరి ఈ రోజున తింటే ఇంకెన్ని లాభాలో తెలుసుకోండి.. మృగశిర కార్తె మొదటి రోజు చేపలు తినాలన్నది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. చేపలను…
Seediri Appalaraju : వైసీపీ ఇచ్చిన పెన్షన్ల కంటే కూటమి ప్రభుత్వం తక్కువ ఇస్తోందని.. ఈ ఘనత చంద్రబాబుదే అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలం అయ్యారంటూ దుయ్యబట్టారు. 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇస్తా అన్న చంద్రబాబు.. ఇప్పుడు అతిగతి లేకుండా వదిలేశారంటూ మండిపడ్డారు. ఇంటింటికి పెన్షన్స్ ఇచ్చే విధానం పోయిందని.. వృద్దులు, వికలాంగులు ఎండలలో ఉంటూ ఇబ్బడి పడుతున్నారని తీవ్ర ఆగ్రహం…