ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై షాకింగ్ కామెంట్స్ చేశారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవమేనన్న ఆమె.. నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గరివాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారని.. అసలు, ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నాకు చెప్పారని తెలిపారు.. ఆనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తానని వెల్లడించారు…
ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడపుతున్నారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ఇక, ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. 25 నిమిషాలకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలతో పాటు.. తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి…
చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన కలకలం రేపుతోంది.. బాధితురాలికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు సీఎం చంద్రబాబు, బాధితురాలి పిల్లలు చదువుకోవడానికి చర్యలు తీసుకుంటామన్నారు.. రూ.5లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు.. అయితే, ఈ ఘటనపై స్పందించిన కేఏ పాల్.. నేను మహిళను కొట్టిన వారిపై 302 కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను.. ప్రభుత్వం సరైన చర్య తీసుకోకపొతే నేను రంగంలోకి దిగుతాను అని ప్రకటించారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నాలుగు దశాబ్దాలకు పైగా టిడిపితో అనుబంధం ఉన్న నల్లమిల్లి... తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఈసారి కాషాయ కండువా కప్పుకున్నారు. రామకృష్ణారెడ్డి తండ్రి నల్లమిల్లి మూలారెడ్డి టిడిపి ఆవిర్భావం నుంచి కొనసాగుతూ అదే పార్టీ తరపున నాలుగు సార్లు అనపర్తి ఎమ్మెల్యేగా గెలిచారు.
కుప్పంలో జరిగిన ఓ ఘటన రాజకీయ విమర్శలకు దారి తీసింది.. అయితే, నేరుగా బాధితురాలితో ఫోన్లో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. టీడీపీ స్థానిక లీడర్‌కు ఫోన్ చేసిన ఆయన.. బాధితురాలి దగ్గరకు వెళ్లిన తర్వాత.. ఆమెతో మాట్లాడారు.. ఎట్టిపరిస్థితిలోనూ నిందితులకు వదిలిపెట్టనని.. తప్పకుండా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.. బాధితురాలి పిల్లల చదువుకి 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు చంద్రబాబు.
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతోంది.. దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఏపీలో మహిళల భద్రతపై ఎక్స్ (ట్విట్టర్)లో మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు.. చంద్రబాబు రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా?మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురంలో ఒక మహిళను చెట్టుకు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం అమల్లోకి రానున్నట్టు పేర్కొంది.. ఈ ఏడాది అక్టోబర్ 2 కల్లా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరంతో పాటు మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా అరికట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో ఇప్పుడు నిందితుల సంఖ్య 39కి చేరింది.. మద్యం కుంభకోణంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి పేరును FIRలో చేర్చింది సిట్.. A 38గా చేవిరెడ్డి పేరును పేర్కొంది.. ఈ మేరకు కోర్టులో మెమో వేశారు సిట్ అధికారులు.. చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు ను ఈ కేసులో A 34గా చేర్చింది..
కుప్పం ఘటన చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. సీఎం చంద్రబాబు నియోజకవర్గంలోనే మహిళపై ఇలాంటి దాడులు జరిగితే రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతిరోజు మహిళలపై.. చిన్నారులపై దాడులు, అత్యాచారాలు చేయడం.. చెట్టుకు కట్టేసి కోట్టడం జరుగుతున్నాయి.. ఇన్ని దారుణాలు దేశంలో ఇంకే రాష్ట్రంలో అయినా జరిగాయా...? అని ప్రశ్నించారు.. ఆడపిల్లల జోలికి వస్తే అదే చివర రోజు…