AP Cabinet: రప్పా.. రప్పా.. వ్యాఖ్యలపై కేబినెట్‌లో చర్చ.. వారికే డ్యామేజ్..!
- ఏపీలో తాజా రాజకీయాలపై కేబినెట్ భేటీలో చర్చ..
- వైఎస్ జగన్.. రప్పా.. రప్పా వ్యాఖ్యల ప్రస్తావన..
- ఆ విషయంలో వైసీపీకి ఇబ్బందులు వచ్చాయన్న మంత్రులు..
- ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. మరోవైపు, రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై సైతం మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు.. ఈ మధ్య ఏపీ పాలిటిక్స్‌లో కాకరేపిన రప్పా.. రప్పా వ్యాఖ్యలు కూడా ప్రస్తావనకు రాగా.. ఇటీవల వైఎస్ జగన్ పర్యటన.. కాన్వాయ్ ప్రమాదంపై చర్చించారు.. అయితే, రప్పా.. రప్పా వ్యాఖ్యల విషయంలో వైసీపీకి ఇబ్బందులు వచ్చాయని మంత్రులు అభిప్రాయపడ్డారట.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదని చర్చించారట మంత్రులు.. ఇక, రప్పా.. రప్పా.. వంటి వ్యాఖ్యలను వైఎస్ జగన్ సమర్ధించడం.. ఆ పార్టీకే బాగా నష్టం కలిగించందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కొందరు మంత్రులు..
Read Also: YS Jagan Case: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మరో కేసు.. పిలిచినప్పుడు పీఎస్‌కు రావాలని..!
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
ఇక, స్వర్ణాంధ్ర పీ4పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. జిల్లా ఇంచార్జి మంత్రులు చైర్మన్ గా జిల్లాలో.. ఎమ్మెల్యే చైర్మన్ గా నియోజకవర్గ పరిధిలో ఈ కమిటీ ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.. ఈ నెలాఖరులోగా కమిటీల ఏర్పాటు.. మొదటి సమావేశం పూర్తి అయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.. మరోవైపు, రెండో విడత భూ సమీకరణపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.. 44 వేల ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్.. ఇక, బనకచర్ల ప్రాజెక్ట్ పై ఎవరూ బహిరంగంగా మాట్లాడకూడదని మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు.. అమరావతిలో 44 వేల ఎకరాల అదనపు భూమి సేకరించేందుకు నిర్ణీత సమయం విధించే విషయంపై చర్చించారు.. SIPB సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. DRC మీటింగ్ లను, నియోజకవర్గ ప్లానింగ్ మీటింగ్స్ కండక్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం..
తాజావార్తలు
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!